Widgets Magazine

శుక్రవారం (10-08-2018) దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

శుక్రవారం, 10 ఆగస్టు 2018 (08:50 IST)

మేషం: దంపతుల మధ్య అనురా, వాత్సల్యాలు పెంపొందుతాయి. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాబడికి మించిన ఖర్చుల వలన చేబదుళ్ళు తప్పవు. రిప్రజెంటేవ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు. బంధువులను కలుసుకుంటారు.
 
వృషభం: భాగస్వామిక, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థులతో సంబంధాలు మరింత మెరుగుపడుతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
మిధునం: ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. సన్నిహితుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. కుటుంబీకులతో స్వల్ప విభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. 
 
కర్కాటకం: రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. తరచు సభ, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. భార్య, భర్తల మధ్య కలహాలు, పట్టింపులు అధికమవుతాయి. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.  
 
సింహం: ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పాతమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బందులు ఎదుర్కుంటారు. మీ ఆనాలోచిత నిర్ణయాల వలన కుటుంబంలో కలతలు తప్పవు. 
 
కన్య: పోస్టల్, కొరియల్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాలవారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ సంతానం ధోరణి చికాకు పరుస్తుంది. సొంతంగా ఏదైనా చేయాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. ఇరుగు పొరుగు వారి వైఖరి వలన ఒకింత ఇబ్బందులు తప్పవు.    
 
తుల: కొన్ని పనులు విసుగు కలిగించినా మెుండిగా పూర్తిచేస్తారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. పొగడ్తలు, హామీలకు దూరంగా ఉండాలి. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. పోస్టల్, కొరియల్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృశ్చికం: విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. బంధువులు మీ నుండి పెద్దమెుత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. 
 
ధనస్సు: కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. అకాల భోజనం, విశ్రాంతి లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది. ఖర్చులకు సరిపడు ఆదాయం సమకూర్చుకుంటారు. బ్యాంకు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. 
 
మకరం: గృహ నిర్మాణాలు, మరమ్మత్తులలో వ్యయం అధికమవుతుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు వంటివి పెరుగుతాయి. మీ వాక్‌చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. శత్రువుల పై జయం పొందుతారు.  
 
కుంభం: ఉమ్మడి వ్యవహారాల్లో చికాకులు, భాగస్తులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి విముక్తి, పనిభారం తగ్గుతాయి. విద్యార్థుల మెుండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యములో సంతృప్తి కానవస్తుంది. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి.   
 
మీనం: ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. బంధువులతో పట్టింపులు వీడి సంబంధాలు పెంచుకుంటారు. కలప, ఐరన్, ఇసుక, సిమెంటు వ్యాపారులకు పురోభివృద్ధి. రాబడికి మించిన ఖర్చుల వలన చేబదుళ్ళు తప్పవు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. దైవకార్యాల్లో పాల్గొంటారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
పంచాంగం ఆస్ట్రాలజీ భవిష్యవాణి దినఫలాలు Daily Horoscope Daily Predictions Daily Astrology Today Astro

Loading comments ...

భవిష్యవాణి

news

శుభప్రదమైన మాసం.. నోములు, వత్రాలతో సందడే సందడి..

శ్రావణ మాసం శుభప్రదమైన మాసం. ఈ మాసంలో శుభకార్యాలను నిర్వహించేందుకు ముహూర్తాలు ...

news

నాగ పంచమి-గరుడ పంచమి రోజున ఇలా పూజలు చేస్తే...

కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, ...

news

గురువారం మీ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

మేషం: వ్యాపారాలలో పోటీ పెరగడం వలన అధికంగా శ్రమించవలసి ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల ...

news

బుధవారం (08-08-18) దినఫలాలు - నూతన దంపతుల మధ్య...

మేషం: కొత్త వ్యాపారాభివృద్ధికి శ్రమించాలి. స్వయం కృషితో రాణిస్తారు. విద్యార్థులకు ...

Widgets Magazine