Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీ రాశి ఫలితాలు (18-07-17)... ప్రేమానురాగాలు బలపడతాయి...

సోమవారం, 17 జులై 2017 (22:15 IST)

Widgets Magazine

మేషం : బ్యాంకింగ్ అధికారులతో సంభాషించేటపుడు జాగ్రత్త వహించండి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి, ఆందోళనలు తప్పవు. ఇతరులకు సహాయసహకారాలు అందించడం వల్ల మీకు సంఘంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. 
 
వృషభం : భాగస్వామిక వ్యాపారాలు నుంచి విడిపోయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కళ, క్రీడ, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. స్త్రీలకు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది. చేయని యత్నాలకు ప్రతిఫలం ఆశించకండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
మిథునం : తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. మీ ఆలోచనలు గోప్యంగా ఉంచి ఎదుటివారి తత్వాన్ని గమనించండి. 
 
కర్కాటకం : గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు అభద్రతాభావం, ఆందోళనకు గురవుతారు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలు, వస్త్ర, ఆభరణాలు పట్ల ఆసక్తిగా వ్యవహరిస్తారు. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టడానికి యత్నిస్తారు. 
 
సింహం : ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ మెరుగుపడతాయి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. విదేశీ ప్రయాణాలు వాయిదాపడతాయి. ధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తారు. దంపతుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. 
 
కన్య : ఉద్యోగస్తులు, సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో ప్రముఖుల సలహా పాటించడం మంచిది. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ దైనందిన కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. 
 
తుల : రాజకీయాలలోని వారు ప్రత్యర్థులతో మాటపడక తప్పదు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు పడటంవల్ల మాటపడతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
వృశ్చికం : కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు కలిసివచ్చేకాలం. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు పెరిగినా సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి. 
 
ధనస్సు : కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. మీ సంతానం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిది కాదు అని గమనించండి. 
 
మకరం : ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. దంపతుల మధ్య నూతన విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. పాతమిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి.  
 
కుంభం : ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. మొండిబాకీలు వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి. చిన్నతరహా, చిరు వృత్తులవారికి సరైన తృప్తి లభిస్తుంది. 
 
మీనం : ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. వైద్య, శాస్త్ర, వాణిజ్య రంగాల వారికి శుభదాయకం. నిరుద్యోగుల యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. మీ ప్రత్యర్థుల ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కొంటారు. సిమెంట్, ఐరన్ రంగాల్లో వారికి పురోభివృద్ధి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

మీ రాశి ఫలితాలు (17-07-2017)... ప్రమోషన్లు వస్తాయి....

మేషం : వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి ...

news

మీ రాశి ఫలితాలు(16-07-2017)... నిరుద్యోగులకు జయం...

మేషం: బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. వాహనం ...

news

మీ రాశి వార ఫలితాలు... 16-07-2017 నుంచి 22-07-2017 వరకు...

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం పరిచయాలు బలపడతాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి ...

news

మీ రాశి ఫలితాలు(15-07-2017)... ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు...

మేషం: క్లిష్ట సమస్యలను ధైర్యం ఎదుర్కొంటారు. మీ సంతానంపై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి ...

Widgets Magazine