Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీ రాశి ఫలితాలు(15-07-2017)... ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు...

శుక్రవారం, 14 జులై 2017 (22:25 IST)

Widgets Magazine

మేషం: క్లిష్ట సమస్యలను ధైర్యం ఎదుర్కొంటారు. మీ సంతానంపై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
వృషభం : రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి తప్పదు. ప్రేమానుబంధాలు ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మరింత బలపడతాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. మీ శ్రీవారి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
మిథునం : చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినా గానీ నెమ్మదిగా సమసిపోతాయి. మీ కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వీలైనంతవరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. మార్కెటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పవు. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.
 
కర్కాటకం : వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులు పైఅధికారులతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత అవసరం. తరచూ, సభా సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
సింహం : మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారాల పునరాలోచన అవసరం. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. రావలసిన మొండిబాకీలు వాయిదాపడతాయి.
 
కన్య : విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. దంపతుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. ఎంతో శ్రమించిన మీదట గానీ అనుకున్న పనులు పూర్తి కావు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతుంది. ఆలయ సందర్శనాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. భాగస్వామికులకు మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది.
 
తుల : ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. మీ నిర్లక్ష్యం వల్ల గృహములో విలువైన వస్తువులు చేజారిపోతాయి. జాగ్రత్త వహించండి. సోదరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.
 
వృశ్చికం: సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తుసామగ్రి అందజేస్తారు. గృహంలో మార్పులుచేర్పులు వాయిదాపడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో చికాకులు తప్పవు. స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు.
 
ధనుస్సు: మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను అధికంగా ఎదుర్కొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు లేకపోవడంతో ఆందోళనకు గురవుతారు.
 
మకరం : స్త్రీలకు ఏ విషయంలోను మనస్థిమితం అంతగా ఉండదు. విద్యార్థులకు గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు సంభవం. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. తొందరపాటుతనం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది.
 
కుంభం : ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. విద్యార్థులకు రెండో విడత కౌన్సిలింగ్ అనుకూలం. కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. పత్రికా సిబ్బందికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. దేవాలయ విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. 
 
మీనం: మీ శ్రీవారి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యం. హోటల్, తినుబండా వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశం లభిస్తుంది. ఎప్పటి నుంచి వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Horoscope Daily Predictions Rashi Phalalu Your Rashi

Loading comments ...

భవిష్యవాణి

news

మీ రాశి ఫలితాలు(14-07-2017)... మంచి అవకాశాలు లభిస్తాయి...

మేషం : స్త్రీలకు తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. శత్రువులు మిత్రులుగా ...

news

మీ రాశి ఫలితాలు(13-07-2017)... ధన లాభములు, వాహన సౌఖ్యం...

మేషం : ప్రముఖుల సహకారంతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆరోగ్యంలో చికాకులు ...

news

మీ రాశి ఫలితాలు(12-07-2017)... కొత్త పరిచయాలతో లబ్ది...

మేషం : తోటివారి ఉన్నతస్థాయిలో పోల్చుకోవడం క్షేమం కాదు. రావలసిన ధనం కొంత ముందు వెనుకగానైనా ...

news

మీ రాశి ఫలితాలు(11-07-2017)... సెంటిమెంట్ల ప్రభావం అధికం...

మేషం : ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పన్నులు, ఫీజులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. ...

Widgets Magazine