Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీ రాశి ఫలితాలు(16-07-2017)... నిరుద్యోగులకు జయం...

శనివారం, 15 జులై 2017 (22:47 IST)

Widgets Magazine
rashi chakra

మేషం:
బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
వృషభం
ఎవరికీ బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. ఉమ్మడి విధులు నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. సినిమా రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మిథునం
వ్యాపారంలో ఆశించినంత ప్రయోజనాలు సాధించడం కష్టం. మొండిబాకీలు వసూలు కాగలవు. పెద్దల సహకారం లోపిస్తుంది. రుణ యత్నాలకు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో లావాదేవీలు అనుకూలిస్తాయి. రాజకీయ రంగాలవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. 
 
కర్కాటకం
స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఉపాధ్యాయులకు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
సింహం
ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రుల నుంచి మనస్పర్థలు తలెత్తుతాయి. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రవాణా రంగాల వారికి సమస్యలు అధికమవుతాయి. ప్రముఖుల కోసం అధిక సమయం వెచ్చిస్తారు. 
 
కన్య 
ఆదాయానికి మించి ఖర్చులు. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. 
 
తుల 
పెరిగిన ఖర్చులు, ఇతరాత్రా అవసరాలు మీ ఆర్థిక స్థితికి అవరోధంగా నిలుస్తాయి. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు సంతృప్తి, పురోభివృద్ధి. మీ కార్యక్రమాలు పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
వృశ్చికం 
కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు మూలక సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్, చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఆటుపోట్లు అధికం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. 
 
ధనస్సు
ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్థిరచరాస్తులు క్రయవిక్రయాలు వాయిదా పడటం మంచిది. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. 
 
మకరం
స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహనకు వస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చికాకులు తప్పవు. 
 
కుంభం
మిత్రుల నుంచి అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. రుణ యత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. రాజకీయనాయకులు ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
మీనం 
చేతి వృత్తుల వారికి శ్రమాధిక్యత, ఒత్తిడి అధికమవుతాయి. మీ దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. ఉద్యోస్తులకు ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. ప్రేమికులు తొందరపాటుతనం సమస్యలకు దారితీస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెలకు అవసరం.
 
వార ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

మీ రాశి వార ఫలితాలు... 16-07-2017 నుంచి 22-07-2017 వరకు...

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం పరిచయాలు బలపడతాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి ...

news

మీ రాశి ఫలితాలు(15-07-2017)... ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు...

మేషం: క్లిష్ట సమస్యలను ధైర్యం ఎదుర్కొంటారు. మీ సంతానంపై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి ...

news

మీ రాశి ఫలితాలు(14-07-2017)... మంచి అవకాశాలు లభిస్తాయి...

మేషం : స్త్రీలకు తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. శత్రువులు మిత్రులుగా ...

news

మీ రాశి ఫలితాలు(13-07-2017)... ధన లాభములు, వాహన సౌఖ్యం...

మేషం : ప్రముఖుల సహకారంతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆరోగ్యంలో చికాకులు ...

Widgets Magazine