శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 25 జూన్ 2015 (18:17 IST)

ఏదైనా తిన్నట్లు, నీళ్లు తాగినట్లు కల రాకూడదట..

ఏదైనా తినుచున్నట్లు కల వచ్చిన మంచిది కాదు. ఆ కుటుంబంలో కలతలు చెలరేగును. ప్రేమించినవారు మోసం చేయుదురు. నీటిని తాగినట్లు కలవస్తే రోగాలు తప్పవు. కానీ కల్లు తాగుతూ, మాంసము అందరితో కలిసి తినుచున్నట్లు కల వచ్చినట్లైతే ధనలాభము కలుగును. ఒంటరిగా తినుచున్నట్లు కలవచ్చినట్లైతే అవమానముల పాలగుదురు.
 
ఇష్టము లేని పదార్థములు తినుచున్నట్లు కల వచ్చినట్లైతే చేసే వృత్తిలో చికాకులు, మనో వ్యధతో అశాంతిగా ఉంటారు. దోసకాయలు కలలో కనిపిస్తే రోగాలు తొలగిపోయి ఆరోగ్యము కలుగును. వ్యాపారస్తులకు స్వల్ప అనుకూలముగా నుండును. ఏ విధమైన ధాన్యములు గానీ, ధాన్యాలను పోగు చేసినట్లుగాని కలలోకి వచ్చినట్లైతే ధనలాభము కలుగును.