గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 28 జూన్ 2014 (16:27 IST)

సముద్రాలను దాటినట్టు కలగంటే?

ప్రతి ఒక్కరికీ నిద్రలో ఏదో ఒక కల వస్తుంది. అయితే ఆ కలలో కొన్ని మంచివి, మరికొన్ని చెడువి కనిపిస్తుంటాయి. వాటిని చాలా వరకు అందరూ నమ్మి, ఆ కలలను తలచుకొని ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే నీటికి సంబంధించిన కలలు వస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండిలా...
 
* నదులను, సముద్రాలను దాటినట్లు కల వస్తే మీకు అంతా శుభమే జరుగుతుందట. 
* సముద్రపు ఒడ్డున లేక అలల మధ్యన ఉన్నట్లు కనిపిస్తే మాత్రం కష్టాలు కలుగుతాయట.
* నదులు, సముద్రములు, చెరువులు, కొలనులు కనిపిస్తే తలచిన కార్యం నెరవేరి దేహ సౌఖ్యం కలుగుతుందట. 
* మురికి నీరు కనపడితే అనుకున్న పనులు నెరవేరవు ఇంకా అనారోగ్యం కలుగుతుందట. 
 
* అదే మురికి నీటిని త్రాగినట్లు కలగంటే జైలులో ఉన్న వారు బయటికి వస్తారట. ధనం, ఆరోగ్యం కూడా కలుగుతుందట.
* వరదలు వచ్చి తగ్గినట్లు కల వస్తే కష్టాలు తీరుతాయి.
 
* భావిలోంచి నీరు తోడుతున్నట్లు కలగంటే ఐశ్వర్యం, వివాహప్రాప్తి కలుగుతుందని పూర్వీకులు చెపుతున్నారు.