గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 15 డిశెంబరు 2014 (18:43 IST)

ఆవునెయ్యి మాత్రమే పూజకు శ్రేష్ఠం.. గేదె నెయ్యితో మాత్రం..?

శుభకార్యాల్లోనూ, క్షేత్రాల్లోనూ ఆవునెయ్యిని ఉపయోగించడమనేది ప్రాచీనకాలం నుంచి ఆచారంగా వస్తున్న సంగతి తెలిసిందే. దైవకార్యాలకి సంబంధించిన యజ్ఞయాగాది కార్యక్రమాలలోనూ, దోష నివారణార్థం చేసే శాంతి హోమాలలోను ఆవునెయ్యి తప్పనిసరిగా వాడుతుంటారు. అలాగే దేవతలకి నివేదన చేసే వివిధరకాల పదార్థాలలోను ఆవునెయ్యినే ఉపయోగిస్తుంటారు. 
 
దేవాలయాలకి సంబంధించిన విషయాల్లోనే కాదు, ఇంటికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లోనూ ఆవునెయ్యిని ఉపయోగించడమే శ్రేష్టం. దీపారాధనకు నైవేద్యాలకు తప్పనిసరిగా ఆవునెయ్యినే వినియోగించాలని పండితులు అంటున్నారు. అయితే గేదెనెయ్యిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శుభకార్యాలకు ఉపయోగించకూడదు. ఈ విధంగా చేయడం వలన అనేక దోషాలు అక్కున చేరతాయని శాస్త్రం చెబుతోంది. 
 
గేదె నెయ్యితో దీపారాధన చేయడం వలన, నైవేద్యాలు తయారు చేయడం వలన నీచమైన జంతుజన్మలు కలుగుతాయని అంటోంది. అందువలన పుణ్యఫలాలను ఆశించి చేసే దైవకార్యాలలో పాపాలను కొనితెచ్చే పనులు జరగకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా వుందని పురోహితులు అంటున్నారు.