గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 19 నవంబరు 2015 (16:41 IST)

కార్తీక సోమవారం ప్రాధాన్యత.. చేయాల్సినవి!

కార్తీక మాసమంతా మాంసాహారానికి దూరంగా ఉండాలి. శాకాహారమే తీసుకోవాలి. అలాకాకుండా కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజుల్లోనైనా మాంసాహారాన్ని పక్కనబెట్టేయాలి. సోమవార వ్రతంతో మోక్షానికి మార్గం సుగమమవుతుందని, కైలాసం ప్రాప్తిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.  
 
* కార్తీక మాసంలో వచ్చే సోమవారాలను పవిత్రంగా భావించాలి. 
* వంకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు తినకూడదు. ఇతర కాయగూరలు తీసుకోవచ్చు. 
* భోజనం మధ్యాహ్నం పూట మాత్రమే తీసుకోవాలి. రాత్రి, ఉదయం పూట అల్పాహారం వంటివి తీసుకోవాలి 
* ఆవు పాలు, పండ్లు తీసుకోవచ్చు. 
 
* అభ్యంగన స్నానం చేయాలి.
* ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పరమాత్మ శివుడికి పూజ చేయాలి.. ఇంటిముంగిట దీపాలు వెలిగించాలి. 
* శివపురాణం చదవడం లేదా వినడం చేయాలి. 
*  ప్రతిరోజూ శివపురాణంలోని ఓ అధ్యాయం చేయాలి 
* రోజూ లేదా సోమ, పౌర్ణిమ రోజున శివుడికి చేతనైన ప్రసాదం సమర్పించాలి. లేకుంటే పండ్లతోనైనా సరిపెట్టుకోవచ్చు.