శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: గురువారం, 29 డిశెంబరు 2016 (15:05 IST)

డాక్టర్ రామన్ 2017 మేష రాశి ఫలితాలు...

ఈ రాశివారికి భాగ్యము నందు శని, జూన్ నుండి వక్రగతిన అష్టమము నందు అక్టోబర్ నుంచి శని తిరిగి భాగ్యము నందు, ఆగస్టు వరకు రాహువు పంచమము నందు, కేతువు లాభము నందు, ఆ తదుపరి అంతా రాహువు చతుర్థము నందు, కేతువు రాజ్యము నందు సెప్టెంబర్ 12వ తేదీ వరకు బృహస్పతి షష్ఠమ

మేషరాశి :  అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు 
ఆదాయం-5, వ్యయం-5 పూజ్యత-3, అవమానం-1
 
ఈ రాశివారికి భాగ్యము నందు శని, జూన్ నుండి వక్రగతిన అష్టమము నందు అక్టోబర్ నుంచి శని తిరిగి భాగ్యము నందు, ఆగస్టు వరకు రాహువు పంచమము నందు, కేతువు లాభము నందు, ఆ తదుపరి అంతా రాహువు చతుర్థము నందు, కేతువు రాజ్యము నందు సెప్టెంబర్ 12వ తేదీ వరకు బృహస్పతి షష్ఠమము నందు, ఆ తదుపరి అంతా సప్తమము నందు సంచరిస్తాడు. 
 
మీ గోచారం పరీక్షించగా  "సాహనవిధాధీ తపః క్రియం, అవివేకః పరమాంవదాం వదం" అన్నట్లుగా తొందరపడి ఏ పని చేయకండి. బాగుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుంది. ఈ సంవత్సరం అదృష్టం మీ తలుపు తడుతుంది. రోగ స్థానము నందు బృహస్పతి ఉన్నందునవల్ల అప్పుడప్పుడు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఎటువంటి సదవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహం కాని వారు శుభవార్తలు వింటారు. 
 
తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తగలవు. సాంకేతిక రంగాల్లో వారి నిపుణతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనే కోరిక అధికం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు విఘటించవచ్చు. జాగ్రత్త వహించండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఏజెంట్‌లకు,  బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నవంబర్ వరకు చాలా యోగప్రదంగా ఉంటుంది. విద్యార్థులు విద్యావిషయాల పట్ల ఏకాగ్రత వహించి అభివృద్ధి చెందుతారు. విద్యార్థినుల్లో తొందరపాటు నిర్ణయాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో వారికి పురోభివృద్ధి. గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి కాస్త అభివృద్ధి, చికాకు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోగలవు. ఇతరులను తేలికగా ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం ద్వారా మంచిది. మీలో ఆకస్మికంగా నిరుత్సాహం, ఆందోళన , ఆవేదన అధికం అవుతుంది. క్రయ విక్రయ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులపై చదువులకై చేయు ప్రయత్నాల్లో కించిత్ ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కోళ్ళ, మత్స్య, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి మందులు, రసాయనిక ద్రవ్య వ్యాపారస్తులకు ఆశించినంత వారికి అభివృద్ధి ఉండదు. రక్షక భటులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. సైంటిస్టులకు, కళాకారులకు, సంగీత సాహిత్య రంగాల్లో వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. మే, జూన్ నెలలో వస్తువులు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. 
 
కొంతమంది మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు, కేటరింగ్ రంగాల్లో వారికి కూరగాయ, పచ్చడి వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉండగలదు. రుణం ఏ కొంతైనా తీర్చగలుగుతారు. ఈ  సంవత్సరం అంతా ఒత్తిడి, చికాకు, ఆందోళన ఎదుర్కొన్నట్లైతే జయం మిమ్మల్నే వరిస్తుంది. వైద్య రంగాల్లో వారికి శస్త్రచికిత్స చేసేటప్పుడు మెళకువ అవసరం. ఒకటి విఘంటించవచ్చు. వస్త్ర రంగాల్లోవారికి బంగారం, వెండి లోహ వ్యాపారస్తులకు సంతృప్తికరంగాను, ఆశాజనకంగాను ఉండగలదు. ఈ సంవత్సరం అంతా మిశ్రమఫలితంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు విష్ణు సహస్ర నామ, లలితా సహస్రనామ పారాయణ వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. 
 
* అశ్వని నక్షత్రం వారు జీడిమామిడి, భరణి నక్షత్రం వారు దేవదారు, కృత్తికనక్షత్రం వారు అత్తి చెట్టును నాటినట్లైతే సర్వదోషాలు తొలగిపోతాయి.
* అశ్విని నక్షత్రం వారు కృష్ణవైఢూర్యం, భరణి నక్షత్రం వారు వజ్రం, కృత్తికా నక్షత్రం వారు కెంపు ధరించినట్లైతే శుభదాయకంగా ఉంటుంది. 
* ఈ రాశివారు దుర్గమ్మ వారిని ఎర్రని పూలతోనూ, వరసిద్ధి వినాయకుని గరికతో పూజించినట్లైతే శుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది.