శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: గురువారం, 29 డిశెంబరు 2016 (20:05 IST)

కన్యా రాశి ఫలితాలు... 2017లో ఎలా ఉంది?

కన్యా రాశివారికి సెప్టెంబర్ 12వ తేదీ వరకు జన్మమయి నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా ద్వితీయము నందు, జూన్ నెలవరకు చతుర్థము నందు శని, ఆ తదుపరి వక్రగతిన తృతీయము నందు, అక్టోబర్ నుంచి తిరిగి చతుర్థము నందు, ఆగస్టు నెలవరకు వ్యయము నందు రాహువు, షష్ఠమము నందు కేతువు

కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు 
చిత్త 1, 2 పాదములు ఆదాయం -2, వ్యయం-11, పూజ్యత-2 అవమానం-4
 
కన్యా రాశివారికి సెప్టెంబర్ 12వ తేదీ వరకు జన్మమయి నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా ద్వితీయము నందు, జూన్ నెలవరకు చతుర్థము నందు శని, ఆ తదుపరి వక్రగతిన తృతీయము నందు, అక్టోబర్ నుంచి తిరిగి చతుర్థము నందు, ఆగస్టు నెలవరకు వ్యయము నందు రాహువు, షష్ఠమము నందు కేతువు, ఆ తదుపరి అంతా లాభము నందు రాహువు, పంచమము నందు కేతువు సంచరిస్తాడు. 
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా ''యాచవన్యః గౌరవం క్షీణన్యః'' అన్నట్లు ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు జాగ్రత్త వహించండి. ఆదాయంలో అసమానతల వల్ల కొంత చికాకులు ఎదుర్కొన్నప్పటికీ నెమ్మదిగా అధిగమించుగలుగుతారు. వృత్తి, వ్యాపారాలు విస్తరించడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నతపదవులు పొందుతారు. వారికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. రావలసిన బకాయిలు వాయిదా పడతాయి. విద్యార్థులు అధిక శ్రమానంతరమే సత్ఫలితాలు పొందుతారు. నిత్యవసర వస్తు వ్యాపారులకు ఆశాజనకం. ప్రైవేట్ సంస్థల్లో వారికి శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. స్త్రీలు బంధుమిత్రులను ఆకట్టుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. 
 
వ్యవసాయ రంగాల్లో వారికి ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో కొంత మెరుగైన ఫలితాలు కానవస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు పాటించినప్పటికీ చికాకులు ఎదుర్కొనక తప్పదు. నిరుద్యోగులు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగును. కొబ్బరి, పండ్ల, పూల పానీయ చల్లని వ్యాపారులకు కలిసిరాగలదు. రాజకీయ రంగాల్లో వారికి విరోధుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. 
 
క్రీడా రంగాల్లో వారికి తమ ప్రతిభకు తగన గుర్తింపు, రాణింపు పొందుతారు. ప్రయాణాల్లో ఒకింత ప్రయాసలు ఎదుర్కొన్నప్పటికీ సంతృప్తి, ప్రయోజనం ఉంటాయి. స్పెక్యులేషన్ కలిసిరాగలదు. మందులు, రసాయనిక, సుగంధద్రవ్య ఫ్యాన్సీ వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. అవివాహితులు శుభవార్తలు వింటారు. ఉపాధ్యాయులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. వైద్య విజ్ఞాన రంగాల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. పొదుపు పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. దంపతుల మధ్య పరస్పర అవగాహన అవసరం. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు లేదా అమ్మకానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. 
 
* అక్టోబర్ నుంచి అర్ధాష్టమ శనిదోషం ఏర్పడుతున్నందువల్ల ప్రతి శనివారం 17సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి, చామంతి పూలతో శనిని పూజించినట్లైతే దోషాలు తొలగిపోతాయి. 
* ఈ రాశి వారు విష్ణసహస్రనామ పారాయణ వల్ల , రుద్రుని ఆరాధించడం వల్ల, ధన్వంతరీ దేవతను పూజించడం వల్ల ఆరోగ్యం, అభివృద్ధి, శుభం చేకూరుతుంది. 
* ఉత్తరానక్షత్రం వారు జువ్వి, హస్తా నక్షత్రం వారు కుంకుడు, చిత్తనక్షత్రం వారు తాటి మొక్కను నాటినట్లైతే సర్వదోషాలు తొలగిపోతాయి. 
* ఉత్తరానక్షత్రం వారు స్టార్ రూబి, హస్తా నక్షత్రం వారు స్పందనముత్యాన్ని, చిత్తనక్షత్రం వారు జాతి పగడాన్ని ధరించినట్లైతే కలిసిరాగలదు.