గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 అక్టోబరు 2014 (17:23 IST)

ఇల్లు కొనడం కుదరట్లేదా? చెంబు పాత్రలు దానం చేయండి!

ఇల్లు కొనాలనుకుంటున్నారా? లేదా ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారా? అయితే సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. శుక్రదశ సుభిక్షంగా ఉంటేనే ఇంటిని కొనడం లేదా.. ఇంటి నిర్మాణం  చేపట్టడం వీలవుతుంది. అయితే శుక్రదశ లేనివారు ఎలాంటి పరిహారం చేస్తే ఇంటి నిర్మాణం చేయవచ్చు లేదా ఇల్లు కొనొచ్చు అనేది తెలుసుకోవాలంటే.. కుమార స్వామిని ప్రార్థించాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.  
 
నవగ్రహాల్లో ఒకటైన శుక్రగ్రహ ప్రభావంతోనే వాహన యోగం, గృహ యోగాన్ని అంచనా వేయడం కుదురుతుంది. శనిగ్రహం ప్రభావంతో కూడా ఇంటి నిర్మాణం, వాహనాల కొనుగోళ్లను జ్యోతిష్యులు అంచనా వేస్తారు. జాతకులకు శుక్ర, శని గ్రహాల అనుగ్రహం లేకపోతే కష్టాలు తప్పవు. ఇంకా సొంతిల్లు ఏర్పడటం కష్టసాధ్యం.
 
అయితే ఇల్లు కొనాలనే కల సుసాధ్యం కావాలంటే.. భూమి కారకుడు.. కుజగ్రహాధిపతి సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడం ఉత్తమమైన మార్గం. అంతేగాకుండా.. పేదలకు.. నివాసానికి స్థలం లేకుండా ఫుట్ పాత్‌లపై నిద్రించే వారికి చెంబు పాత్రలను దానం చేయాలి. ఇలా చేస్తే తప్పకుండా ఇంటి నిర్మాణం, లేదా కొత్త ఇంటిని కొంటారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.