గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By chj
Last Modified: శనివారం, 25 ఫిబ్రవరి 2017 (22:52 IST)

సుఖసంతోషాలకు, అప్పుల బాధ పోయేందుకు....

మనదేశం అనేక విశ్వాసాలపై నడుస్తుంటుంది. అందుకే కొన్ని పద్ధతులను పాటిస్తుంటారు. ఆచరిస్తుంటారు. మానవ జీవితంలో సుఖసంతోషాల కోసం కొన్ని సూత్రాలను చెప్పారు. అవేంటో చూద్దాం. సుఖ సంతోషాలు కరువైనవారు పసుపు రంగు పూలు ధరించండి, క్రమేపీ స్థితి మెరుగవుతుంది. అప్ప

మనదేశం అనేక విశ్వాసాలపై నడుస్తుంటుంది. అందుకే కొన్ని పద్ధతులను పాటిస్తుంటారు. ఆచరిస్తుంటారు. మానవ జీవితంలో సుఖసంతోషాల కోసం కొన్ని సూత్రాలను చెప్పారు. అవేంటో చూద్దాం.
 
సుఖ సంతోషాలు కరువైనవారు పసుపు రంగు పూలు ధరించండి, క్రమేపీ స్థితి మెరుగవుతుంది.
అప్పుల బాధ ఎక్కువగా వుంటే తెలుపు పూలు ధరించటం వల్ల రుణ బాధలు తగ్గుతాయి.
ఆరోగ్యం సరిగా లేని వారు, శరీరం నొప్పులు వున్నవారు మరువం, మందారాలు కలిపి ధరించండి... ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.
పెళ్ళి చూపులప్పుడు ఎరుపు పూలు, పసుపు పూలు కలిపి మాలకట్టి ధ‌రించండి వివాహం విషయం లో కన్యలకు ఎంతో శుభకరంగా  ఫలితాలొస్తాయి .
మంచి తీర్ధంలో రెండు తులసి దలాలు వేస్తే అవి మానస సరోవర జలాలంత పవిత్రమవుతాయి.
కూర్చునే పీఠానికి శుభ్రం చేసి నాలుగు మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి. చాపైతే విభూది బొట్లు గుడ్డను ఆసనంగావాడితే కుంకుమ బొట్లను పెట్టండి.
భర్త బయటకు వెళ్ళేటపుడు షర్ట్ వేసుకుంటుంటే, గుండీలు మీరు పెట్టండి. మీ కుడి చేతితో తాకి వెళ్లమనండి. భర్తలకు ఆ రోజు సంపాదనా, విజయం సంతోషం వెంట ఉంటాయి. 
 
ఆ... ఇవన్నీ మూఢ నమ్మకాలు. అలా జరుగుతుందా.. ఇలా ఎందుకు జరుగుతుందనే వాదనలు వద్దు. ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు అనుభవాలను బట్టే కలుగుతాయి. వీటిని పాటించటానికి ఖర్చేమీ కాదు కదా? కొంచెం శ్రద్ద కావాలి అంతే.