శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (15:15 IST)

నెగటివ్ ఎనర్జీ పారిపోవాలంటే.. ఉప్పు-నీరు చాలు..

నెగటివ్ ఎనర్జీ ఇంట్లో వుందా..? మనిషిలో వుందా..? కనుక్కోవడం ఎలాగో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. నెగటివ్ ఎనర్జీ మనిషిలో వుంటే ఇతరులు చెప్పిన మాటకు విలువ ఇవ్వకపోవడం.. చిరాకుగా వుండటం, ఒత్తిడికి

నెగటివ్ ఎనర్జీ ఇంట్లో వుందా..? మనిషిలో వుందా..? కనుక్కోవడం ఎలాగో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. నెగటివ్ ఎనర్జీ మనిషిలో వుంటే ఇతరులు చెప్పిన మాటకు విలువ ఇవ్వకపోవడం.. చిరాకుగా వుండటం, ఒత్తిడికి లోనుకావడం, పనిభారం అధికంగా వుందని చెప్పడం, పనిని ఆస్వాదిస్తూ చేసుకోలేకపోవడం ద్వారా మనిషిలో నెగటివ్ ఎనర్జీ వుందని గమనించాలని.. ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వుందంటే.. ఆ ఇంట గొడవులు, కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు ఏర్పడటం వంటివి కలుగుతాయి. ఈ నెగటివ్ ఎనర్జీని దూరం చేసుకోవాలంటే.. ఇంటి మూలల్లో రాళ్ల ఉప్పును వుంచి పెట్టాలి. ఆ ఉప్పును వారానికోసారి తీసి పారేయడం చేయాలి. మళ్లీ అదే ప్రాంతంలో కొత్త ఉప్పును వుంచాలి. ఇలా కొద్దివారాల పాటు చేయడం ద్వారా ఆ ఇంట నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. 
 
అలాగే ఉదయం పూట దీపారాధన చేయడం, ధూపం వేయడం.. భక్తిగీతాలను ఉచ్ఛరించడం.. ద్వారా ఇంట నెగటివ్ ఎనర్జీ పారిపోతుంది. ఇంకా పడకగది మూలలో ఓ గ్లాసుడు నీటిలో రాళ్ల ఉప్పును వేసి 24 గంటల పాటు వుంచాలి. ఆ నీటి మరుసటి రోజు పారబోసి.. కొత్తగా ఉప్పు, నీరు చేర్చి అదే ప్రాంతంలో వుంచాలి. ఆ నీరు నలుపుగా మారినట్లైతే ఆ ఇంట నెగటివ్ ఎనర్జీ వున్నట్లేనని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు.
 
అదే ఉప్పు నీరు తెలుపుగా రంగు మారకుండా వున్నట్లైతే.. ఆ ఇంట నెగటివ్ ఎనర్జీ వున్నట్లు గ్రహించాలి. ఒక వేళ గ్లాసులోని ఉప్పు నీరు నలుపుగా మారితే ఆ నీరు తెలుపుగా మారేంతవరకు పడకగది మూలల్లో వుంచడం చేయాలి. ఇంకా ఇంటి గడపకు పసుపుకుంకుమ, రంగవల్లికలతో అలంకరించుకుంటే ఆ ఇంట నెగటివ్ ఎనర్జీ ఏమాత్రం వుండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 
అలాగే ఇంటిని శుభ్రంగా వుంచుకోవడం.. ఇంటి నిండా వెలుతురు వుండేలా చూసుకోవడం.. ఇంట్లో పనికిరాని వస్తువులు పారేయడం.. పాత దుస్తులను అలాగే అలమరాల్లో వుంచడం, కొత్త వస్తువులు కొన్నప్పటికీ పాత వస్తువులను అలాగే నిల్వ చేసుకుని వుండటం ద్వారా ఆ ఇంట నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇందుకే పాత పుస్తకాలు, పాత దుస్తులు, పాత వస్తువులను తొలగించడం.. ఎప్పుడూ ఇంటిని శుభ్రంగా వుంచడం చేయాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.