శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (13:34 IST)

ఏనుగు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందే తెలుసా?

కలలు రావడం అనేది అందరికి సహజమే. కానీ కొన్ని కలలో పర్వతాలు, నదు, అడవులు, జంతువులు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి పులులు, సింహాలు, ఏనుగులు కూడా కనిపిస్తుంటాయి. ఒకవేళ అలాంటి జంతువులు కనుక మీ కలలో కనిపించినప్ప

కలలు రావడం అనేది అందరికి సహజమే. కానీ కొన్ని కలలో పర్వతాలు, నదు, అడవులు, జంతువులు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి పులులు, సింహాలు, ఏనుగులు కూడా కనిపిస్తుంటాయి. ఒకవేళ అలాంటి జంతువులు కనుక మీ కలలో కనిపించినప్పుడు భయం కలుగుతుంది. మరునాడే ఉదయం లేవగానే ఈ విషయాన్ని అందరితో చెప్పుతూ ఆందోళన చెందుతుంటారు.
 
కాని ఒక విషయం, కలలో ఏనుగు కనుక కనిపిస్తే మంచిదేనని శాస్త్రంలో చెప్పబడుతోంది. ఏనుగు కుంభస్థలం లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతోంది. మరి అటువంటి ఏనుగు కలలో దర్శనం ఇవ్వడం చాలా శుభప్రధమని ఆధ్యాత్మికం గ్రంధాలలో చెబుతున్నారు. ఏనుగులను దర్శించుకోవడం సమస్త పాపాలు, దారిద్య్రం, దుఃఖాం నశించిపోతాయి. 
 
అలానే ఏనుగును దర్శించుకోవడం వలన అదృష్టం, ఐశ్వర్యం చేకూరుతుందని అందరి నమ్మకం. పుణ్యక్షేత్రాలలో గజ వాహనంగా ఏనుగులు భగవంతుని సేవలలో తరిస్తుంటారు. గజ ముఖంతోనే వినాయకుడు తొలి పూజలు అందుకుంటాడు. అందరి విఘ్నాలను తొలగిస్తుంటాడు. అలాంటి ఏనుగులు కలలోనే కాదు బయట కనిపించినా కూడా ఇలాంటి ఫలితాలే కలుగుతాయని శాస్త్రంలో స్పష్టం చేయబడుతోంది.