గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (12:06 IST)

దైవపూజలో కర్పూరం ఎందుకు వెలిగించాలి? కర్పూరం వెలిగేలా.. అహం కూడా?

వారానికి మంగళ, శుక్ర, శనివారాల్లో పూజ చేస్తుంటాం. పూజకు అగరబత్తీలు, పువ్వులు, నైవేద్యం కోసం పదార్థాలు వాడుతుంటాం. ముఖ్యంగా కర్పూరం పూజలో ఉండి తీరాల్సిందే. కానీ కర్పూరం వెలిగించడం ద్వారా లాభమేంటి.. కర్

వారానికి మంగళ, శుక్ర, శనివారాల్లో పూజ చేస్తుంటాం. పూజకు అగరబత్తీలు, పువ్వులు, నైవేద్యం కోసం పదార్థాలు వాడుతుంటాం. ముఖ్యంగా కర్పూరం పూజలో ఉండి తీరాల్సిందే. కానీ కర్పూరం వెలిగించడం ద్వారా లాభమేంటి.. కర్పూరం దైవ ప్రార్థన కోసం ఎందుకు ఉపయోగిస్తున్నారు.. అనేది తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. 
 
కర్పూరం వెలిగించడానికి వెనుక కూడా కొన్ని శాస్త్రీయ కారణాలు వున్నాయి. అందుకే మన పూర్వీకులు దేవుడు ముందు కర్పూరం వెలిగించడాన్ని ఒక అలవాటుగా చేశారు. కర్పూరం ద్వారా వచ్చే పొగ పీల్చడం ద్వారా ఆస్తమా, టైఫాయిడ్, హిస్టీరియా, కీళ నొప్పులు వంటి సమస్యలను తగ్గిస్తుంది. 
 
ఆధ్యాత్మికంగా మనలో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. దీని ద్వారా వచ్చే పొగ వల్ల చుట్టూ వుండే వాతావరణంలో వుండే క్రిములు, బ్యాక్టీరియా నశిస్తాయట. ఇంకా కర్పూరం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కర్పూరం ఎలాగైతే పూర్తిగా మండి పోతుందో, మనలో వున్న అహం కూడా అలాగే హరిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అహం, కోపాన్ని హరించి.. ఆధ్యాత్మిక చింతనను పెంచేందుకే కర్పూరం వెలిగిస్తారని వారు చెప్తున్నారు. ఇంకా ఆరోగ్య పరంగా కర్పూరం మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది. నరాల బలహీనతకు చెక్ పెడుతుంది.