శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (18:38 IST)

కుజుని వలన కలిగే దోషాలు.. శాంతి మార్గాలు!

కుజుడు శత్రు, రోగ, రుణములకు, సహోదరులకు కారకుడు. కుటుంబ కలహాలు, కత్తుల వలన గాయాలు, శత్రుబాధలు, అవమానాలు, నుదురు, కండరములు. రక్తము పడుట, అంటువ్యాధులు, ఆపరేషన్లు, శిక్షలు పడుట మొదలగునవి జరిగినప్పుడు కుజబలం లోపించినట్లు గుర్తించాలి. 
 
కుజ ధ్యానం: 
ప్రతప్త గాంగేయనిభం గ్రహేశం, సింహానస్థం కమలాసిహస్తమ్|
సురా సురైః పూజిత పాద యుగ్మం భౌమం దయాళుం హృదయేస్మరామి ||
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం 
కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహమ్ ||
 
కుజ యంత్రం 
ఓం ఐం హ్రీం ద్రాం కంగ్రహాధిపతియే భౌమాయ స్వాహా ||
 
8 3 10 
9 7  5
4 1  6 మంగళవారం రాత్రి కుజహోరయందు అనగా రాత్రి వేళలో తెల్లవారుజామున 3-4 గంటల మధ్య ధరించాలి. ప్రతినిత్యం ఉదయము స్నానంచేసి శుచిగా అంగారక ధ్యానం 21సార్లు చెయ్యాలి. మంత్రజపం 108మార్లు జపించి, పైన తెలిపిన ప్రకారము యంత్రాన్ని పూజించి ధరించాలి. 21 మంగళవారాలు కందులు దానమివ్వాలి.
 
మంగళవారం రోజు చాలా నిష్ట నియమంగా వుండి, అభ్యంగన స్నానం చేయడం, రాత్రి భోజనం, సంభోగం, మంచంపై పరుండటం, స్త్రీలను హింసించడం, మాంసాహారం తినడం, దైవనింద వంటివి చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.