శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (19:37 IST)

శ్రీ కృష్ణ పరమాత్మకు 8 సంఖ్యకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?

శ్రీ కృష్ణ పరమాత్మకు 8 సంఖ్యకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సింది. శ్రీ కృష్ణుడు పుట్టిన తిథి  అష్టమి. దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. దేవకీ వసుదేవులకు అష్టమ గర్భం. ఆయనకు భార్యలు ఎనిమిదిమంది. కృష్ణుని జన్మనక్షత్రమైన రోహిణి నక్షత్ర క్రమంలో నాలుగవది. అంటే అష్టమ సంఖ్యలో సగం. పదహారు వేలమంది గోపికలు. పదహారు సంఖ్యను, ఎనిమిది సంఖ్యతో భాగించవచ్చును.
 
ఇక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అష్టమం ఆయఃస్థానం. లగ్నం నుండి ఆరవస్థానం మేనమామ. అష్టమత్‌ అష్టమం కూడా ఆయువును చూస్తుంది. అంటే అది మేనమామకు తృతీయం అన్నమాట. 'అష్టమి అష్టకష్టాలు' అన్న నానుడి ఉంది. కానీ జయ తిథికి దుర్గాదేవి అధిష్ఠాన దేవత. విజయసూచిక ఎనిమిది సంఖ్య శని గ్రహాన్ని సూచిస్తుంది. శని ఆయుఃకారకుడు. ఎనిమిది సంఖ్యను రాయటం మొదలుపెడితే ఆ సంఖ్యను ఆపకుండా రాయవలసి వస్తుంది.
 
రోహిణి నక్షత్రం చంద్రుడికి ఉచ్ఛస్థానం. సహజ చతుర్ధాధిపతి చంద్రుడికి ప్రాధాన్యం రోహిణి నక్షత్రం. అంటే మనఃకారకుడు. చంద్రుడు మాతృ, ఆహార, వాహన, గృహభోగాన్ని సూచిస్తాడు. ఆత్మకారకుడు రవి. అగ్నిని మానవుడికి తానే ఇస్తానని సూచించాడు. సహజ ఆరవ స్థానం శత్రు, రోగ, రుణాలను సూచిస్తుంది. దానికి అధిపతి బుధుడు (అంటే నారాయణుడన్నమాట). అందుకే 'వైద్యో నారాయణో హరిః' అనమని పెద్దలు చెప్తున్నారు. అందుచేత శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని స్మరించుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.