శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 డిశెంబరు 2014 (16:57 IST)

3 నెలల బ్రేక్ తర్వాత పెళ్లిళ్ల సీజన్: పెళ్లికాని ప్రసాద్‌లకు పండగే!

మార్గశిరం వస్తోంది.. పెళ్లిళ్ల సీజన్‌ను తెస్తోంది. మూడు నెలల తర్వాత పెళ్లిళ్ల సీజన్ రావడంతో పెళ్లికాని ప్రసాద్‌లు పండగ చేసుకోనున్నారు. మార్గశిర మాసం వస్తూనే పెళ్లి ముహుర్తాలను తీసుకు రావడంతో వస్త్ర దుకాణాలు, జ్యుయెలరీ షాపులు, షాపింగ్ మాళ్లు సందడిగా మారాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి రోజు అనేది వేద మంత్రాలు, గానాబజానాలు, విందులు, వినోదాలతో మధురానుభూతిగా మిగిలిపోతుంది. 
 
భాద్రపద, అశ్వీయుజ, కార్తీక మాసాల్లో వివాహ ముహూర్తాలు లేకపోగా, దానికితోడు, గోదావరి పుష్కరాలు రానున్నాయి. దీంతో, పెళ్లి కాని ప్రసాదులు ఆందోళన చెందారు. అయితే, మార్గశిర మాసం వస్తూనే ఈ నెల 6, 7, 10, 12, 13, 17, 18 తేదీలలో శుభముహూర్తాలను తీసుకొచ్చింది. దీంతో, వారిలో సంతోషం కలుగుతోంది.
 
ఇందులో 13, 18 తేదీల్లో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నట్టు అర్చకులు చెబుతున్నారు. ఈ నెల దాటితే జనవరి 22 నుంచి మార్చి 15 వరకు కూడా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తరువాత పుష్కరాలు వస్తుండడంతో వివాహం మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.