గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 7 నవంబరు 2015 (14:19 IST)

ముహూర్తాలొచ్చేశాయ్.. నవంబర్, డిసెంబరులో ఒక్కటి కానున్న వేలాది జంటలు!

శుభ ముహూర్తాలొచ్చేశాయ్. నవంబర్, డిసెంబరులో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. గత మూడు నెలలుగా పుష్కరాలు రావడంతో ముహూర్తాలు లేకపోవడంతో మంగళవాయిద్యాలు అంతగా వినిపించలేదు. అయితే ప్రస్తుతం వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు వచ్చేశాయి. తద్వారా కల్యాణ మండపాలకు కొత్త కళ సంతరించుకుంది. 
 
నవంబర్, డిసెంబరులో మంచి ముహూర్తాలుండటంతో పాటు జనవరి 11 నుంచి ఫిబ్రవరి 9 వరకు మంచి ముహూర్తాలుండవని పురోహితులు చెప్తుండటంతో.. నవంబర్, డిసెంబరుల్లోనే తమ కుమారులు, కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేసేయాలని తల్లిదండ్రులు తొందరపడుతున్నారు. 
 
ఈ క్రమంలో నవంబరు 7, 13, 14, 15, 17, 18, 19, 20, 22, 26 తేదీలతో పాటు డిసెంబరులో 2, 4, 5, 6, 14, 16,17, 20, 21, 24, 25, 27, 30, 31 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు అంటున్నారు. తద్వారా ప్రధాన నగరాల్లోని కల్యాణ మండపాల్లో పెళ్ళి సందడి మొదలైంది.