గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 30 ఏప్రియల్ 2016 (14:57 IST)

మే నెలలో మీ మాస ఫలితాలు... ఆంజనేయస్వామికి పూజించాల్సిన రాశులవారు....

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఆర్థిక స్థితి ఏమంత సంతృప్తినీయదు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు రూపొందించుకుంటారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. యత్నాలు ఫలించక నిరుత్సాహం చెందుతారు. విద్యార్థుల్లో ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్య భంగం, శ

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
 
ఆర్థిక స్థితి ఏమంత సంతృప్తినీయదు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు రూపొందించుకుంటారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. యత్నాలు ఫలించక నిరుత్సాహం చెందుతారు. విద్యార్థుల్లో ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్య భంగం, శ్రమ అధికం. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వృత్తి వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. భాగస్వామిక చర్చలు పురోగతిని సాగుతాయి. ఉద్యోగస్తులు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వ్యవహారాలు, పనులు స్వయంగా చూసుకోండి. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. ఆత్మీయుల సలహా పాటించండి. దంపతుల మధ్య అవగాహన లోపం చికాకులు తలెత్తుతాయి. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. కార్యసిద్ధికి ఆంజనేయస్వామికి గారెలు నైవేద్యం సమర్పించండి.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర, 1,2 పాదాలు
 
మీ మాటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఉద్యోగస్తులు హోదా పెరిగే సూచనలున్నాయి. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. అధికారులకు ధన ప్రలోభం తగదు. నిరుద్యోగులకు శుభవార్త శ్రవణం. వృత్తుల వారికి సామాన్యం. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి.ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరమవుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి. అనుభవం గడిస్తారు. పెద్ద సంస్థలతో భాగస్వామ్యం అనుకూలిస్తుంది. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు. జూదాలు, పందేల జోలికి పోవద్దు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం తక్కువ. పెద్ద మొత్తం ధన సహాయం క్షేమం కాదు. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. కార్యసాధనకు మరింత శ్రమించాలి. దాసాంజనేయస్వామికి తమలపాకులతో అర్చన శుభం, జయం.
 
మిధునం: మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
 
ఈ మాసం యోగదాయకమే. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. వాగ్గాటితో ఆకట్టుకుంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. రుణ యత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు భారమనిపించవు. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. విలువైన వస్తువుల జాగ్రత్త. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు, పరిశ్రమలు, సంస్థల స్థాపనకు అనుకూలం. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. మొక్కులు తీర్చుకుంటారు. ప్రయాణంలో జాగ్రత్త. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఈ రాశి వారికి హనుమాన్ చాలీసా పారాయణం శుభదాయకం.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
 
ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రేమ వ్యవహారం వివాదాస్పదమవుతుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. రుణ విముక్తులవుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అధికారులకు సాదర వీడ్కోలు లభిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. అభయాంజనేయస్వామికి చామంతి పూలు, తమలపాకులతో అర్చన కలిసిరాగలదు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
 
ఈ మాసం అనుకూల, ప్రతికూల ఫలితాల సమ్మేళనం. ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. రావలసిన ధనంలో కొంతమొత్తం అందుతుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మానసిక ప్రశాంతత, వాహన యోగం పొందుతారు. కలిసివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే. పట్టుదలతో యత్నాలు సాగించండి. ముఖ్యమైన పత్రాలు, విలువైన వస్తువుల జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు మెరుగైన అవకాశం లభిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. కార్యసాధనకు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. 
 
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు.
 
సంతానం విషయంలో శుభ పరిణామం సంభవం. ఆత్మీయులకు చేయూతనిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు అధికం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. మీ శ్రీమతి వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. వ్యవసాయ తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు. ప్రయాణంలో అసౌకర్యానికి లోనవుతారు. దైవ, సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. అనుయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వవద్దు. నిర్మాణాలు వేగవంతమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారుల తీరుకు అనుగుణంగా మెలగాలి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్యను అధిగమిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సంకల్పసిద్ధికి ఆంజనేయస్వామికి అప్పాలు నైవేద్యం సమర్పించండి. 
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
 
అన్ని రంగాల వారికి శుభదాయకమే. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. వృత్తుల వారికి జనసంబంధాలు బలపడతాయి. సామరస్యంగా వివాదాలు పరిష్కరించుకుంటారు. ప్రయాణంలో ఒకింత చికాకులు తప్పవు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలువైన వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. సంబంధాలు, పరిచయాలు ఏర్పడుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. పదవుల స్వీకరణకు అనుకూలం. ప్రత్యర్థులతో అప్రమత్తంగా ఉండాలి. వాహన చోదకులకు దూకుడు తగదు. కార్య సాధనకు అభయాంజనేయస్వామిని మందార పూలతో పూజించండి. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యోష్టం.
 
ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవాలి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులుల సానుకూలమవుతాయి. కళాకారులకు ప్రోత్సాహకరం. విలువైన వస్తువులు, నగలు జాగ్రత్త. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఏ విషయాన్ని తెగేవరకూ లాగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. భాగస్వామ్యం అనుకూలిస్తుంది. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశి వారికి శుభం, జయం. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం.
 
ఈ మాసం అన్ని విధాలా అనుకూలమే. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రుణ విముక్తులవుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. అయినవారితో ఉల్లాసంగా గడపుతారు. వృత్తులవారికి అవకాశాలు కలిసివస్తాయి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఆశావహదృక్పథంతో ఉద్యోగయత్నం చేయండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. ఖర్చులు భారమనిపించవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పనులు సానుకూలతకు బాగా శ్రమించాలి. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు అమలుచేస్తారు. పెద్ద సంస్థలతో భాగస్వామ్యం అనుకూలిస్తుంది. అభయాంజనేయస్వామికి గారెల నైవేద్యం శుభదాయకం. 
 
మకరం: ఉత్తరాషాడ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
 
వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. రుణ, విదేశీ చదువుల యత్నాలు ఫలిస్తాయి. ఆదాయాభివృద్ధి, మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం. పరిచయాలు, సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ధన ప్రలోభాలకు లొంగవద్దు. అధికారులకు హోదా మార్పు, స్వస్థలన చలన ప్రాప్తి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రయాణం తలపెడతారు. ఆంజనేయస్వామికి గులాబీలు, చామంతులతో అర్చన ఈ రాశి వారికి శుభదాయకం. 
 
కుంభం: ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
 
నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రుణ విముక్తులవుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ఉద్యోగ ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. చిన్నతరహా చిరు వ్యాపారులకు ఆశాజనకం. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. మీ నిర్ణయాలు ఖచ్చితంగా తెలియజేయండి. రవాణా రంగాల వారికి శ్రమ, చికాకులు అధికం. వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈ రాశి వారికి తమలపాకుతో ఆంజనేయస్వామి అర్చన శుభం, జయం.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
 
ఈ మాసం శుభదాయకమే. వ్యవహారాల్లో మీదే పైచేయి. సమర్థతకు గుర్తింపు. అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. పెద్దమొత్తంలో సరుకు నిల్వలో జాగ్రత్త. ఆశావహదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణం అనుకూలిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో పోటీని దీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులలకు అవకాశాలు లభిస్తాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. జూదాల జోలికి పోవద్దు. లక్ష్య సాధనకు ఆంజనేయస్వామికి క్షీరాన్నం నైవద్యంగా సమర్పించండి.