శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2015 (16:04 IST)

నీరు పుక్కిలించి పోసినట్లు కలగంటే..?

నీరు పుక్కిలించి పోసివట్సు కలగంటే ఆపదలు తొలగిపోతాయి. ఇతరుల చేతి నుంచి నీటి చెంబు అందుకుని మంచినీరు తాగినట్లు కలవస్తే సంతానము అభివృద్ధి కలుగుతుంది. అదే ఇచ్చే చెంబు పడినట్లు కలగన్న మిత్రులకు కీడు కలుగుతుంది. 
 
గృహము నిండా నీరు విరజిమ్మినట్లు కలగంటే నష్టము కలుగుతుంది. నదిలో తలపైకి ఎత్తి ఈదినట్లు కల వస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. అదే తలముంచి ఈదినట్లు కలవస్తే వ్యాపారులకు, ఇతరులకు కష్టాలు కలుగుతాయి. ఓడ ఎక్కినట్లు కలవస్తే ప్రయాణాలు తథ్యమని పండితులు అంటున్నారు. 
 
నీటిలో తిరగడం వల్ల కాళ్ళకు పాచి పట్టినట్లు కలగన్న ధనము లభిస్తుంది. వర్షాలు కురిసినట్లు, వరదలా వచ్చినట్లు కలగంటే రోగాలు తప్పవు. అదే వరదలు తగ్గినట్లు కలగన్నా కష్టాలు తీరుతాయి.