Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సోమాతి అమావాస్య రోజున రావిచెట్టు చుట్టూ..?

మంగళవారం, 12 డిశెంబరు 2017 (11:03 IST)

Widgets Magazine

కృష్ణపక్షం, ధనుర్ మాసంలో సోమవారం పూట అమావాస్య రానుంది. ఈ అమావాస్య డిసెంబర్ 17వ తేదీ ఉదయం 9.29 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం 12 గంటలతో ముగియనుంది. సోమవారం 12 గంటల్లోపు రావిచెట్టును నిష్ఠతో ధ్యానిస్తూ.. ప్రదక్షణలు చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
అంతేకాదు.. సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.
 
సోమావతి కథలోకి వెళ్తే.. ఒకానొక ఊరిలో ఓ సాధువు ఓ వ్యాపారి కుటుంబానికి వస్తూ వుండేవాడు. ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంట్లోని పెళ్లికాని ఓ కన్యను ముఖం చూసి దీవించకుండానె వెళ్లిపోయాడు. సాధువు దీవించకుండా వెళ్లడానికి కారణం తెలియక ఆ కుటుంబం.. జ్యోతిష్యుడిని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో ఆ కన్య జాతకం చూసిన జ్యోతిష్యుడు.. ఈమెకు వివాహం జరిగితే భర్త అనతి కాలంలోనే మరణిస్తాడు. ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందని చెప్పాడు. అది విని దిగ్భ్రాంతి చెందిన కుటుంబీకులకు ఆ జ్యోతిష్యుడు పరిష్కారం కూడా చెప్తాడు. 
 
సింఘాల్ ప్రాంతంలోని ఓ చాకలి స్త్రీ వద్ద కుంకుమ అడిగి నుదుటన ధరిస్తే కన్యకు దోషం పోతుందంటాడు. ఇదే తరహాలో చాకలి స్త్రీ వద్దకు చేరుకున్న ఆ కన్య సోమావతి అమావాస్య రోజున ఆమె వద్ద కుంకుమ పొందుతుంది. ఆపై రావిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేసింది. ఆమె జాతక దోషం కూడా అంతటితో తొలగిపోతుంది. అందుకే సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. 2017లో ఇప్పటికే ఆగస్టు 21న ఓ సోమాతి అమావాస్య ముగియగా.. డిసెంబర్ 18వ తేదీన రెండో సోమాతి అమావాస్య (దీన్ని పౌష అమావాస్య అని కూడా అంటారు) రానుంది. ఈ రోజున వివాహితులు, అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలను తీర్చుకోవచ్చునని పండితులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

నేటి దినఫలాలు : ప్రేమికులకు చిక్కులు తప్పవు

మేషం : పాత మిత్రుల కలయికతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఎల్‌ఐసి, పోస్టల్ ఏజెంట్లకు ...

news

11 డిశెంబరు 2017, మీ రాశి ఫలితాలు...

మేషం : ఈ రోజు స్త్రీలపై పొరుగువారి ప్రభావం అధికంగా ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి ...

news

నేటి దినఫలాలు : స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి

మేషం : విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు స్వీయ అర్జనపట్ల ఆసక్తి, దానికి ...

news

డిశెంబరు10వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ మీ వార రాశి ఫలితాలు(వీడియో)

కర్కాటకంలో రాహువు, తులలో బృహస్పతి, కుజులు, వృశ్చికంలో రవి, శుక్రులు, ధనుస్సులో శని, వక్రి ...

Widgets Magazine