గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (15:30 IST)

సెప్టెంబరు నెల రాశి ఫలితాలు.. విఘ్నేశ్వరుని మారేడు, జమ్మి పత్రాలతో పూజిస్తే...

ఈ మాసం అన్ని విధాలా అనుకూలమే. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రుణబాధలు తొలగుతాయి.

9వ తేదీన బుధుడు వక్రగతిన సింహప్రవేశం. 16వ తేదీన రవి కన్యయందు, 18వ తేదీ శుక్రుడు తుల, కుజుడు, ధనస్సు నందు ప్రవేశం. 22వ తేదీ బుధునికి వక్రత్యాగం. 
 
4వ తేదీ వరాహజయంతి. 5వ తేదీ వినాయక చవితి, 6వ తేదీన బుషిపంచమి. 11వ తేదీ నుంచి గురుమౌఢ్యమి ప్రారంభం. 15వ తేదీ అనంతపద్మనాభవ్రతం, 17వ తేదీ నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం. 19వ తేదీన ఉండ్రాళ్ళతద్ది. 20వ తేదీ సంకటహర చతుర్థి. 26వ తేదీ సర్వఏకాదశి, 29వ తేదీ మాసశివరాత్రి, 30వ తేదీ మహాలయ అమావాస్య. 
 
మేషం.. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. 
ఈ మాసం అన్ని విధాలా అనుకూలమే. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రుణబాధలు తొలగుతాయి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకుంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక విషయాలు పట్ల ఆసక్తి నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెలకువ వహించండి. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. ప్రముఖ ఆలయాలు సందర్శిస్తారు. సంకల్ప సిద్ధికి వినాయకుని గరికతో పూజిచండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
శుభకార్య యత్నాలు ప్రారంభిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. దైవకార్యాలకు బాగా వ్యయం చేస్తారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పదవులు స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహిచండి. తొందరపడి హమీలివ్వొద్దు. ఉపాధ్యాయుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. విశ్రాంత అధికారులకు సాదరవీడ్కోలు పలుకుతారు. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉపాధి పథకాల్లో  నిలదొక్కుకుంటారు. వృత్తుల వారికి జనసంబంధాలు బలపడతాయి. విదేశీ విద్య, రుణయత్నాల్లో స్వల్ప ఆటంకాలెదురవుతాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. కార్యసాధనకు విఘ్నేశ్వరుడుని చామంతులు, మారేడు దళాలతో పూజించండి. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. యత్నాలు ఫలిస్తాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. పొదుపు పథకాలు లాభిస్తాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఆపత్సమయంలో సహోద్యోగుల సాయం అందిస్తారు. నిరుద్యోగులకు మెరుగైన అవకాశాలు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విఘ్నాధిపతికి తెల్లజిల్లేడు పూలతో పూజించి, ఉండ్రాళ్లు నివేదించిన శుభదాయకం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ప్రతిభకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ బాధలు తొలుగతాయి నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలు ధీటుగా ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో  సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. మానసిక ప్రశాంతతకు గణనాథుని జిల్లేడు, జమ్మి పత్రాలతో పూజించండి. 
 
సింహ : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం ప్రథమార్థం ప్రతికూలతలే అధికం. ఖర్చులు అధికం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. సొంత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. చిరు వ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగులకు సదావకాశం లభిస్తుంది. ఉపాధ్యాయులకు నిరుత్సాహం తప్పదు. అధికారులకు పనిభారం, ఒత్తిడి. దైవకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. గరిక, జామ పత్రాలతో వరసిద్ధి వినాయకుని అర్చన కలిసిరాగలదు. 
 
కన్య : ఉత్తర 2, 3 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. బాధ్యతగా వ్యవహరించాలి. అవకాశాలను జారవిడుచుకోవద్దు. ఖర్చులు అధికం. దైవకార్యాలకు బాగా వ్యయం చేస్తారు. బంధుమిత్రులతో స్పర్థలు తలెత్తుతాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అసాధ్యమనుకున్న పనులు సానుకూలమవుతాయి. ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకుంటారు. ప్రకటనల పట్ల అవగాహన ప్రధాన. వ్యాపారాల్లో ఆటుపోట్లు, స్వల్ప నష్టాలు ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి సామాన్యం. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. విదేశీ విద్యాయత్నం ఫలించదు. ఆకస్మిక ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆశయసాధనకు గణనాథుని జిల్లేడు, తెల్లని పూలతో పూజించండి. 
 
తుల : చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
వ్యవహారాలు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. హామీలు, మధ్యవర్తిత్వాలు తగవు. గుట్టుగా యత్నాలు సాగించండి. సలహాలు అడగొద్దు. మీ ఓర్పు నేర్పులకు పరీక్షా సమయం. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిచండి. పదవుల నుంచి తప్పుకోవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత సంతృప్తినీయవు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. పట్టుదలతో ఉద్యోగయత్నం సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వాహనచోదకులకు దూకుడు తగదు. దైవ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గణనాథుని పంచామృతాభిషేకం అన్ని విధాలా శుభదాయకం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్టం
ఈ మాసం శుభదాయకమే. పదవులు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. దైవకార్యాలకు విరాళాలు అందిస్తారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పనులు సానుకూలమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు సదావకాశం లభిస్తుంది. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వ్యాపారాల్లో పురోభివృద్ధి అనుభవం గడిస్తారు. భాగస్వామిక ఒప్పందాలు, నూతన పెట్టుబడులకు అనుకూలం. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. వివాదాలు కొలిక్కివస్తాయి. గరిక, గన్నేరు పత్రాలతో అర్చన శుభం, జయం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం 
ఈ మాసం అన్ని రంగాల వారికి శుభదాయకమే. అవకాశాలు కలిసివస్తాయి. ఉన్నత పదవులు స్వీకరిస్తారు. ఆర్థిక అంచనాలు ఫలిస్తాయి. నిర్ధేశిత పథకాలతో ముందుకు సాగుతారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. హామీలు, మధ్యవర్తిత్వాలు తగదు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆత్మీయుల సలహా పాటించండి. వ్యాపారాల్లో ఆటంకాలు, నష్టాలు తొలగుతాయి. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి రాగలగుతారు. ఉపాధ్యాయులకు పురస్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. దైవకార్యంలో పాల్గొంటారు. కార్యసాధనకు గణనాథునికి ఉండ్రాళ్లు, కదళీ ఫలాలు నైవేద్యం సమర్పించండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆత్మీయుల సలహా పాటించి లబ్ది పొందుతారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆర్థికస్థితి సామాన్యం. ఖర్చులు విపరీతం. రావలసిన ధనం అతికష్టంమ్మీద అందుతుంది. పట్టుదలతో శ్రమించిన గానీ పనులు కావు. దంపతుల మధ్య దాపరికం తగదు. రావల్సిన ధనం అతికష్టంమ్మీద అందుతుంది. పట్టుదలతో శ్రమించిన గానీ పనులు కావు. దంపతుల మధ్య దాపరికం తగదు. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. సతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. ముఖ్యులతో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. వైద్యరంగాల వారికి ఆశాజనకం. వాహనచోదకులకు దూకుడు తగదు. జిల్లేడు, గరికతో విఘ్నేశ్వరుని అర్చన శుభదాయకం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఏకపక్ష నిర్ణయం తగదు. లక్ష్య సాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. శక్తివంచన లేకుండా శ్రమించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పొదుపు మూలకధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విలువైన వస్తువులు, నగదు, పత్రాలు జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు కొలిక్కివస్తాయి. ఉపాధ్యాయులకు నిరుత్సాహం తప్పదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వివాదాస్పద విషయాలు దూరంగా ఉండాలి. ప్రయాణం కలిసివస్తుంది. సంకల్పసిద్ధికి విఘ్నేశ్వరుని మారేడు, జమ్మి పత్రాలతో పూజిచండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
ఈ మాసం అనుకూలం. ప్రతికూలతల సమ్మేళనం. చక్కని ఆలోచనలతో ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఖర్చులు పెరిగినా ధనానికి ఇబ్బంది ఉండదు. బంధువులు మీ సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం ధన సహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఉపాధ్యాయులకు పురస్కారాలు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం కాదు. గృహ నిర్మాణాలు వేగవంతం అవుతాయి. దైవ, సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గణనాథునికి జిల్లేడు, మామిడి పత్రాలతో అర్చన, కుడుముల నైవేద్యం కలిసిరాగలదు.