Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నవగ్రహాల శక్తి గురించి మీకు తెలుసా? గ్రహశాంతి అంటే?

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (12:01 IST)

Widgets Magazine

గ్రహానికి శాంతి చేయించుకోమని జ్యోతిష్యులు చెప్పారా? గ్రహానికి శాంతి చేయించుకుంటే ఎలాంటి ఫలితం చేకూరుతుంది అని తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. మనకు నవగ్రహాలున్నాయి. నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధిని వికసింపజేస్తాడు. మనస్సును స్థిరపరుస్తాడు. ధైర్యాన్ని ప్రసాదిస్తాడు.

ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలున్నాయి. ఈయన్ని ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు. ప్రశాంతతను ఇస్తాడు. నవగ్రహాల్లో మూడోవాడైన రాహువు కంటి బలాన్ని తగ్గిస్తాడు. శరీరంలోని మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు. ఈయన్ని పూజిస్తే కంటికి బలాన్ని కలుగజేస్తాడు. శరీర మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు. 
 
గురువును ఆరాధిస్తే.. బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే.. వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు. మెదడును చురుకుగా ఉంచుతాడు. ఇక శనిగ్రహం గురించి తెలుసుకుందాం.. శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే.. ఇలా చేయొద్దు.. ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని అనుసరించమంటాడు. ఆ మార్గాన్ని చూపెడతాడు. 
 
ఇక బుధ గ్రహం బుద్ధిమంతుడు. మనం చేస్తున్న ఉద్యోగంలో కొత్త మెలకువలను నేర్పించగలే సమర్థుడు. ఇతనిని పూజిస్తే మాట్లాడటంలో నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు. ధనార్జనకు శక్తిమంతుడు. కేతువును పూజిస్తే.. తీర్థయాత్రలకు వెళ్తారు. లౌకిక ప్రపంచానికి కొద్ది దూరంగా ఉందామని.. దేవతా పూజలో నిమగ్నం చేసే ఆలోచనలను ఇస్తాడు. కేతువు తర్వాతి గ్రహం శుక్రుడు. శుక్రాచార్యుడు. ఈయన్ని పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు. సంతానాన్ని ఇవ్వగలుగుతాడు. 
 
ఇక గ్రహ శాంతి అంటే?
గ్రహాల అనుకూలత తగ్గిన పరిస్థితుల్లో శాంతి చేయించాలి. ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తితే.. గ్రహదోషమని భావించాలి. అయితే ఏ గ్రహం వల్ల అశాంతి కలిగిందనే విషయాన్ని జ్యోతిష్యుల సంప్రదించి వారి సూచనల మేరకు, ఆ గ్రహానికి శాంతి చేయించుకోవడమే గ్రహశాంతి అంటారు. అయితే గ్రహశాంతి చేయించుకోవడం ద్వారా సదరు గ్రహ ప్రభావంతో ఏర్పడే బాధలు పూర్తిగా తొలగిపోవని.. ఆ బాధల నుంచి ఉపశమనం మాత్రమే లభిస్తుందని.. గ్రహ ప్రభావం కాస్త తగ్గుతుందని జ్యోతిష్కులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

ఫిబ్రవరి మాస ఫలితాలు : అవివాహితుల్లో ఉత్సాహం.. కలహాలు, చికాకులు... ధన లాభం...

ఈ మాసం అనుకూల, ప్రతికూలతల సమ్మేళనం. ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. ధన మూలక సమస్యలు ...

news

దేవుడి ఉంగరాన్ని ఏ స్థితిలో ధరించాలో తెలుసా?

మనలో చాలామంది ఉంగరాల్లో చైన్‌లలో దేవుడి ప్రతిమలు ఉంచుకుంటారు. ఉదయాన్నే లేచి కళ్ళకు ...

news

దక్షిణం వైపు హాలు ద్వారం వద్దే వద్దు.. అతిథులు త్వరగా ఇంటి నుంచి వెళ్ళిపోవాలంటే..?

వాస్తు ప్రకారం హాలు ద్వారా దక్షిణ ద్వారం హాని కారకమట. ఈ దిశగా హాలు ద్వారం ఉన్నట్లైతే ...

news

నీరసంగా ఉందా..? అయితే మిరపకాయ, ఉప్పుతో దిష్టి తీసుకుంటే..?

నీరసంగా ఉందా..? ఒళ్ళంతా నొప్పులతో బాధపడుతున్నారా? అలసట ఆవహించిందా? అయితే వెంటనే ...

Widgets Magazine