శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 24 జులై 2014 (16:55 IST)

నవగ్రహ దీపాల నోము ఎలా చేయాలి?

నవగ్రహ దీపాల నోము ఎలా చేయాలి. నవగ్రహాల అనుగ్రహం కోసం, ఐశ్వర్యం పొందేందుకు కార్తీక పౌర్ణమి రోజున ఈ నోము నోచుకుంటారు. శివాలయంలో అభిషేకం చేయించి వినాయకుడిని ఆరాధించాలి. 
 
తొమ్మిది ప్రమిదలు, తొమ్మిది ఒత్తుల చొప్పున వెలిగించి, ఒక్కొక్క ప్రమిద వద్ద నవధాన్యాలలో ఒక్కొక్క రకం ధాన్యం కొద్దిగా ఉంచి, ఒక్కొక్క ప్రమిదను (ధాన్యం సహా) ఒక్కొక్క బ్రాహ్మణునికి దానమివ్వాలి.
 
ఇంకా ప్రతి శనివారం నవగ్రహాలకు దీపమెలిగించినా ఈతిబాధలుండవు. ఆర్థిక ఇబ్బందులు, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావాలంటే కార్తీక పౌర్ణమిన శివాలయంలో అభిషేకం చేయించాలని పురోహితులు అంటున్నారు.