బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 28 జులై 2014 (18:16 IST)

గ్రహణ సమయంలో పాదరస శివలింగాన్ని దర్శించుకుంటే?

గ్రహణ సమయంలో ఈ నియామాలు పాటించాలని జ్యోతిష్యులు అంటున్నారు. గ్రహణ సమయంలో పాదరస శివలింగాన్ని దర్శించుకున్నట్టయితే ఆర్ధికాభివృద్ధి ఉంటుంది. అనారోగ్యాలు నశిస్తాయి. ఎలాంటి కలతలూ, కల్లోలాలూ దరిచేరవు.
 
ఇంకా  గురు మంత్రాన్ని స్మరించుకోవడం మంచిది. ఆ సమయంలో యాదృచ్చికంగా సాధుసన్యాసులు ఎవరైనా తారసపడితే వారికి భక్తిగా నమస్కరించుకోవాలి. గ్రహణ సమయంలో దైవ ప్రార్ధన చేసుకోవాలి.
 
* గ్రహణ సమయంలో ఏమీ తినకపోవడం మంచిది. 
* గ్రహణం విడిచేవరకూ నిద్రించకూడదు.
 * గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎక్కడికీ వెళ్ళకూడదు. ఇంట్లో కూడా కదలకుండా పడుకోవాలి.
 * గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి.
 * గ్రహణానంతరం నది లేదా కాలువలో స్నానం చేయగలిగితే శ్రేష్టం.
 * రుద్రాక్ష ధరించడానికి చంద్రగ్రహణ సమయం మంచిది.
* గ్రహణ సమయంలో స్త్రీపురుష సమాగమం తగదు.
* ప్రత్యేకమైన కళ్ళజోడు పెట్టుకుని మాత్రమే గ్రహణాన్ని చూడాలి. తిన్నగా గ్రహణాన్ని చూస్తే కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉంది.