శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 జనవరి 2015 (16:49 IST)

కలలో దానిమ్మపండు కనిపిస్తే..?

కలలో దానిమ్మపండు కనిపిస్తే..? సంతానము కలుగుతుంది. దానిమ్మ గింజల్ని తిన్నట్లు కలవచ్చినట్లైతే అన్నిటా విజయం సాధిస్తారు. పచ్చిగా వున్న దానిమ్మకాయను చూసినట్లైతే ఉన్నట్టుండి ప్రయాణ సూచనలు గలవని అర్థం. 
 
అలాగే కలలో జామపండును తిన్నట్లు కలవచ్చినట్లైతే మీ ఆరోగ్యము కుదుటపడును. జామపండ్లను విరగకాసిన చెట్టు కలలో కనపడినట్లైతే లేనిపోని అనుమానాలు, భయము కలుగునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
 
కలలో ఖర్జూరపు పండును తిన్నట్లు కనిపించినట్లైతే బంధువర్గములో గౌరవము కలుగును. ఎండు ఖర్జూరము తిన్నట్లు కలవచ్చినట్లైతే యువతీ యువకులకు ఎవరికైనా వివాహము కాని యెడల త్వరలో వివాహమగును. ఖర్జూరపు పండును ఏరుకున్నట్లు కలగంటే ఇంటికి బంధువులు, మిత్రులు రాగలరు.