శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 11 డిశెంబరు 2014 (15:11 IST)

కలలో పూజ చేస్తున్నట్లుగా కల వస్తే.. మంచిదేనా..?

సహజంగా వచ్చే కలల కంటే.. అదీ తెల్లవారుజామున వచ్చే కలలు మాత్రమే నిజమవుతాయంటారు పెద్దలు. కలలో కనిపించే దృశ్యాలను బట్టి ఫలితాలు చెప్తుంటారు. ఈ నేపథ్యంలో కొంతమందికి తాము కలలో పూజ చేస్తున్నట్లుగా కలవస్తే శుభప్రదమే అంటున్నారు పంచాంగ నిపుణులు. 
 
అలాంటి కల వచ్చినప్పుడు దాని ఫలితం ఎలా వుంటుందో తెలియక వాళ్లు తికమక పడుతుంటారు. ఈ విధమైన కల రావడం శుభ సూచకమేనని శాస్త్రం చెబుతోంది. తాము పూజ చేస్తున్నట్టుగా కల రావడం వలన, కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని పంచాంగ నిపుణులు అంటున్నారు.