శుక్రవారం దేవతా విగ్రహాలను శుభ్రం చేస్తే?

శుక్రవారం దేవతా విగ్రహాలను శుభ్రం చేయకపోవడం ఉత్తమం. గురువారాల్లో పూజ గదిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవడం మంచిది. అలాగే గురువారం శుభ్రం చేసుకుని సిద్ధం చేసుకున్న పూజా సామగ్రిపై పవిత్

selvi| Last Updated: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (11:38 IST)
శుక్రవారం దేవతా విగ్రహాలను శుభ్రం చేయకపోవడం ఉత్తమం. గురువారాల్లో పూజ గదిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవడం మంచిది. అలాగే గురువారం శుభ్రం చేసుకుని సిద్ధం చేసుకున్న పూజా సామగ్రిపై పవిత్ర జలం చల్లి.. ఆపై పూజను ప్రారంభించాలి. 
 
ఇంట్లోని దేవతా విగ్రహాలను శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందే శుభ్రం చేయాలి. పండుగ రోజుల్లో అయితే శుక్రవారం సూర్యోదయానికి ముందే పూజా సామగ్రిని, దేవతా విగ్రహాలను శుభ్రం చేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే పూజా సామగ్రిని, విగ్రహాలను సాయంత్రం పూట శుభ్రం చేయకూడదని వారు చెప్తున్నారు. గురువారం ఉదయం పది గంటలకు తర్వాత సాయంత్రం ఐదు గంటల్లోపు పూజా గదిని శుభ్రం చేసుకోవడం మంచిది. సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూజగదిలోని వస్తువులను శుభ్రం చేయడం కూడదని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. దీనిపై మరింత చదవండి :