శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 జులై 2014 (15:55 IST)

రాహు దోషం తొలగిపోవాలంటే.. దీపారాధన చేయండి!

రాహు దోషం తొలగిపోవాలంటే.. దీపారాధన చేయండి.. అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. రాహు యంత్రాన్ని పుష్పాలతో అర్చించాలి. నల్ల దుస్తులు ధరించాలి. ఇంకా మినపప్పును దానం చేసి వేప నూనెతో దీపారాధన చేయడం ద్వారా రాహు దోషం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.  
 
* ఇంకా రాహు భగవానునికి ఏదైనా ఒకరోజు అభిషేకం చేయించాలి. నలుపు వస్త్రాలు, గోమేధికం, బ్లూ లోటస్‌తో పూజ చేయించాలి. రాహు స్తుతి చేసి గరికతో యాగం నిర్వహించి.. మినపప్పు, మినపప్పు పొడి, అన్నం అగ్నికి ఆహుతి ఇవ్వండి. తర్వాత దీపారాధన చేయాలి. 
 
ధ్యానమ్
 
ప్రణమామి సదా రాహుం శూర్పాకారం కిరీటినమ్ |
సైంహికేయం కరాలాస్యం లోకానామభయప్రదమ్ || 1||
 
| అథ రాహు కవచమ్ |
 
నీలాంబరః శిరః పాతు లలాటం లోకవందితః |
చక్షుషీ పాతు మే రాహుః శ్రోత్రే త్వర్ధశరిరవాన్ || 2||
 
నాసికాం మే ధూమ్రవర్ణః శూలపాణిర్ముఖం మమ |
జిహ్వాం మే సింహికాసూనుః కంఠం మే కఠినాంఘ్రికః || 3||
 
భుజంగేశో భుజౌ పాతు నీలమాల్యాంబరః కరౌ |
పాతు వక్షఃస్థలం మంత్రీ పాతు కుక్షిం విధుంతుదః || 4||
 
కటిం మే వికటః పాతు ఊరూ మే సురపూజితః |
స్వర్భానుర్జానునీ పాతు జంఘే మే పాతు జాడ్యహా || 5||
 
గుల్ఫౌ గ్రహపతిః పాతు పాదౌ మే భీషణాకృతిః |
సర్వాణ్యంగాని మే పాతు నీలచందనభూషణః || 6||
 
ఫలశ్రుతిః
రాహోరిదం కవచమృద్ధిదవస్తుదం యో
భక్త్యా పఠత్యనుదినం నియతః శుచిః సన్ |
ప్రాప్నోతి కీర్తిమతులాం శ్రియమృద్ధి-
మాయురారోగ్యమాత్మవిజయం చ హి తత్ప్రసాదాత్ || 7||
 
ఇతి శ్రీమహాభారతే ధృతరాష్ట్రసంజయసంవాదే ద్రోణపర్వణి రాహుకవచం సంపూర్ణమ్- అనే కవచాన్ని పఠించాలి.
 
* ఇంకా బియ్యం పిండితో రాహు గ్రహానికి చెందిన ముగ్గును మంగళవారం పూట పూజగదిలో వేయాలి. తర్వాత దీపమెలిగించి రాహుగ్రహ కవచమ్‌ను పఠించి పూజ చేస్తే రాహు గ్రహ దోషాలు దూరమవుతాయి.