శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2014 (19:23 IST)

బుధునివల్ల కలిగే దోషాలేంటే.. శాంతి మార్గాలు!

బుధుడు వ్యాపార వైద్య శాస్త్రకారకుడు. సామాన్యంగా వ్యాపారముల సరిగా సాగకుండుట. నష్టములు కలుగుట. తన బుద్ధి తెలివి తేటలు మందగించుట, సామర్థ్యము తగ్గుట, మెదడు, ముక్కు, నోరు, నాలుక, జుట్టు చేతులు, ఊపిరితిత్తులు, నరములు థైరాయిడ్ గ్రంథి వీటికి సంబంధించిన బాధలు కలిగినప్పుడు బుధుని బలం లోపించిందని గుర్తించాలి. 
 
బుధధ్యానం :
సోమాత్మజం హంసగతం ద్విబాహుం శంఖేందురూం ఆసిపాశహస్తమ్ |
దయానిధిం భూషణభూషితాంగం బుధంస్మరే మానసపంకజే హమ్ ||
 
ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం |
సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||
 
బుధయంత్రం 
ఓం హ్రాం క్రోం జం గ్రహనాధాయ బుధాయ స్వాహా ||
 
9  4  11
10 8  6
5  12 7
 
బుధయంత్రం 
బుధవారం ప్రభాతవేళ బుధహోర అనగా ఉదయం 6-7 గంటల మధ్యకానీ లేక ఆదివారం చివరి హోర యందుగానీ ఈ యంత్రం ధరించాలి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి బుధ ధ్యానం 25 మార్లు చెయ్యాలి. మంత్రజపం 108 మార్లు జపించి 17 బుధవారాలు పచ్చ పెసలు దానం ఇవ్వాలి. పైవిధంగా యంత్రాన్ని పూజించి ధరించాలి. ప్రతి బుధవారం రాత్రి భోజనము, మంచము, సంయోగము, మాంసాహారమ, మద్యపానం, అప్పులిచ్చుట, పిల్లలను ఏడిపించుట, నలుపు వస్త్రములను ధరించుట, తైల లేపనము వంటివి చేయకూడదు.