శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. భవిష్యవాణి
  4. »
  5. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 5 జూన్ 2014 (17:02 IST)

మీది రేవతి నక్షత్రమా? పసుపు రంగు కర్చీఫ్ వాడండి!

దేవగణ నక్షత్రమైన రేవతిలో జన్మించిన జాతకులు నిరాడంబరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గణితంలో ప్రజ్ఞావంతులు, మేధావులు అయిన ఈ జాతకులు దౌర్జన్యం తగాదాలకు దూరంగా ఉంటారు. అద్భుతమైన జ్ఞాపకశక్తి, సాహిత్య రంగంలో అభిరుచిగల ఈ జాతకులకు పాడిపంటలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తే కలిసివస్తుంది. 
 
శ్రమజీవులు అయిన ఈ జాతకులు ప్రశాంతంగా ఉంటారు. ఎన్ని సమస్యలున్నా వాటినన్నింటిని పక్కనబెట్టి చక్కగా నిద్రపోవడం చేస్తారు. అయితే అన్ని రంగాల్లో ధీటుగా రాణించడం ఆర్థికంగా మంచి స్థితికి ఎదగడం చేస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ఇతరుల ఆస్తికి ఆశపడని రేవతి నక్షత్ర జాతకులు.. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల ఎత్తుల నుంచి తప్పించుకుంటారు. వినూత్నమైన వ్యాపారాలలో కీలకమైన అధికార పదవులను అలంకరిస్తారు. కుటుంబాన్ని, నమ్ముకున్న వాళ్ళని పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తారు. సంతానం పట్ల ప్రేమగా గౌరవంగా ఉంటారు. మంచితనంతోనే జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. దూర ప్రాంతాలను సందర్శించడం, వేద వేదాంగాల సారాన్ని తెలుసుకోవాలని తపన వీరికి ఉంటుంది.
 
పెద్దల పట్ల గౌరవంతో ప్రవర్తించే ఈ జాతకులకు భాగస్వామి అన్నివిధాలా సహకరిస్తుంది. వ్యాపారంలో రాణించి ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకోవడానికి నిత్యం శ్రమించే ఈ జాతకులకు గురువారం కలిసివస్తుంది. ఈ జాతకులు గురువారం ప్రారంభించే పనులు దిగ్విజయంగా పూర్తవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా ఆది, సోమవారాలు కూడా వీరికి శుభ ఫలితాలిస్తాయి. అయితే మంగళవారం మాత్రం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఉండకూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మంగళవారం ఈ జాతకులు ఏ మాత్రం అనుకూలించదు. 
 
ఇకపోతే.. రేవతి నక్షత్రంలో పుట్టిన జాతకులకు 3, 12, 21, 30, 48, 57, 66, 75 మరియు 7, 16, 25, 34, 43, 52, 61, 70 అనే సంఖ్యలు శుభఫలితాలనిస్తాయి. అలాగే 1, 2, 9 అనే సంఖ్యలు కూడా కలిసివస్తాయి. కానీ 5,6 సంఖ్యలు ఈ జాతకులకు అనుకూలించవు. 
 
అలాగే రేవతి నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఎరుపు, పసుపు రంగులు అన్ని విధాలా కలిసివస్తాయి. ఈ రంగు దుస్తులను ధరించడం ద్వారా శాంతి లభిస్తుంది. ఇందులో పసుపు రంగు చేతిరుమాలును వాడటం ద్వారా లాభాలను ఆర్జించవచ్చు. వీరు ధరించే దుస్తుల్లో కొంతైనా పసుపు రంగు ఉండేలా చూసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.