కలలో ఎక్కువ పాములు కనిపిస్తున్నాయా? సర్పదోషాలకు ఇలా చేయండి

శనివారం, 29 జులై 2017 (13:32 IST)

నరదృష్టితో నల్లరాళ్లు బద్ధలవుతాయని పెద్దలంటారు. దృష్టి దోషాలు తొలగిపోవాలంటే.. రాహు దోషాలున్నవారు, కుజ దోషాలున్నవారు, శత్రుభయం కలిగివున్నవారు.. వివాహంలో జాప్యం, సంతానలేమితో ఇబ్బంది పడుతున్నవారు.. ఆదివారం సాయంత్రం.. 4.30 నుంచి 6.00 వరకు, సోమవారం ఉదయం 7.30 నుంచి 9.00 వరకు, శనివారం ఉదయం 9.30 నుండి 11.00 వరకు రాహుకాలంలో నిమ్మకాయ డొప్పలో అష్టమాలిక తైలంతోగాని, నవమూలిక తైలంతోగాని లేదా నువ్వులనూనెతో గానీ దీపారాధన చేసినట్లైతే విశేష ఫలితాలుంటాయి. ఈ సమయంలో దుర్గాఅష్టోత్తరము, సుబ్రహ్మణ్య అష్టకము పఠనం చేయడం ద్వారా దోషాలు, దృష్టి కారకాలు తొలగిపోతాయి. 
 
ఎన్ని సంబంధాలు చూసినా వివాహము కాని అమ్మాయిలు 41 రోజులు పార్వతీ దేవిని ఎర్రని పువ్వులు (మందారం- కనకాంబరాలతో) గాని అష్టోత్తర శతకముతో పూజ చేయించండి. లేదా ఏడు మంగళవారాలు శ్రీకాత్యాయనీ వ్రతము చేయండి. 
 
సర్పదోషాలు వున్నవారు కలలో ఎక్కువగా సర్పములు కనిపించే వారు నాగసిందూరం వాడటం చాలా మంచిది. నవమూలికా తైలం దీపారాధనకు రాహుకాలములో సోమవారం, శనివారం వాడటం చాలా మంచిదని పంచాంగ నిపుణులు అంటున్నారు. దీనిపై మరింత చదవండి :  
Religion Naaga Dosham Naga Sindhuram Kaalasarpa Dosham Sarpa Dosha

Loading comments ...

భవిష్యవాణి

news

మీ రాశి ఫలితాలు (29-07-2017)... ఇలా వుండబోతోంది...

మేషం : ఈరోజు ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. చిన్నారులు, ప్రియతములతో ...

news

మీ రాశి ఫలితాలు (28-07-2017)... ఈ రోజు ఇలా వున్నాయి...

మేషం : ఈరోజు గృహనిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా కొనసాగుతాయి. మీ సమస్యలు, చికాకులు ...

news

వంటగదిలో మందులొద్దు.. పడకగదిలో అద్దాలు వద్దే వద్దు.. నేమ్ ప్లేటుతో మేలెంత?

ఇంట్లో మూడేళ్లకు ఒకసారి గణేశ పూజ లేదా నవగ్రహ పూజ చేయించడం ద్వారా ఆ గృహంలో ప్రశాంతత ...

news

మీ రాశి ఫలితాలు 27-07-2017... ఈ రోజు ఎలా వుండబోతుంది?

మేషం: ఈరోజు ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. ...