నరదృష్టిని, వాస్తుదోషాలను పోగొట్టే తెల్లజిల్లేడు.. శ్వేతార్క గణపతిని పూజిస్తే? (video)

మంగళవారం, 3 జులై 2018 (17:55 IST)

తెల్లజిల్లేడు చెట్టుల్లో తొమ్మిది రకాలున్నాయి. తెల్లజిల్లేడు చెట్టు 12 సంవత్సరాలు వర్షం లేకపోయినా.. సూర్యకాంతితో నీటిని గ్రహించి.. పెరిగే తత్త్వం కలిగినది. తెల్లజిల్లేడు చెట్టులోని వేరును తీసుకుని.. ఆ వేరుతో వినాయకుడిని తయారుచేసుకుని.. ఇంటి పూజగదిలో వుంచి పూజ చేస్తే.. సకలసంపదలు చేకూరుతాయి. 
 
శ్రీ స్వర్ణగణపతి మంత్రాన్ని ఉచ్ఛరించి.. తెల్లజిల్లేడు వినాయకుడిని ప్రార్థిస్తే.. ధనార్జన చేకూరుతుంది. రత్నాలు, విలువైన శిల్పాలు, గుప్త నిధులు వున్న ప్రాంతాల్లో మాత్రమే తెల్లజిల్లేడు చెట్టు పెరుగుతుందని విశ్వాసం. అలాంటి తెల్లజిల్లేడు వేరుతో చేసిన వినాయకుడిని ఇంట వుంచి పూజిస్తే ఐశ్వర్యాలు చేకూరుతాయి.   
 
శ్వేతార్క గణపతిని పూజించే వారికి జ్ఞానం, సంపద, సుఖశాంతులు లభిస్తాయి. తెల్ల జిల్లేడు వేర్ల మీద గణపతి నివశిస్తాడు. ఈ వేర్లు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క గనుక ఇంట ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట.
 
ఇంకా ఆ ఇంట వుండేవారి ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలు పూర్తిగా నశిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు. జాతకచక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, జాతకచక్రంలో సూర్యుడు నీచ స్థితిలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు, వాస్తుదోషాలతో సతమతమయ్యేవారు సర్వకార్యసిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని గృహంలో ప్రతిష్టించి పూజించాలి. 
 
శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. పురోహితుల్ని సంప్రదించి, వారి సలహా మేరకు ముహూర్తం పెట్టుకుని.. ఇంట శ్వేతార్క గణపతిని ప్రతిష్టించుకోవాల్సి వుంటుంది. ఒకవేళ ఆలయాల్లో శ్వేతార్క గణపతి ప్రతిమను కొనుక్కుని తెచ్చుకున్నట్లైతే పూజగదిలో వుంచి రోజూ నైవేద్యం సమర్పించి పూజ చేసుకుంటే సరిపోతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
 దీనిపై మరింత చదవండి :  
శ్వేతార్క గణపతి తెల్లజిల్లేడు సూర్యుడు గణపతి వాస్తు Astrology Ganesha Puraana Aakda Ganesha Shwetark Ganpati Swayambhu Swetark Ganpati

Loading comments ...

భవిష్యవాణి

news

04-07-2018 - బుధవారం మీ రాశి ఫలితాలు.. ఒంటరిగానే లక్ష్యాలను?

మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రహస్య విరోధులు అధికం కావడం ...

news

పితృదోషాలను ఎలా తొలగించుకోవాలో తెలుసా?

పూర్వీకులు, తాతముత్తాలను పితృదేవతలు అంటారు. వారికి జరగాల్సిన ప్రేత కార్యక్రమాలను సక్రమంగా ...

news

మంగళవారం (03-07-2018) రాశిఫలాలు - విందు వినోద కార్యక్రమాల్లో...

మేషం: కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. పూలు, పండ్లు, కొబ్బరి కాయల వ్యాపారులకు ...

news

కాలభైరవునికి బుధవారం పూజ.. కలకండ, అటుకుల పాయసాన్ని?

కాలభైరవుడు మహాశివుని 64రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి. అన్నీ శివాలయాల్లో భైరవుడు ...