శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (14:07 IST)

ఏలినాటి-శనిదోషాలతో బాధపడుతున్నారా... ఈ స్తోత్రాన్ని పఠిస్తే?

త్రయోదని శనివారం నాడు వస్తే ఆ రోజున శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం రోజు శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు. అంతేకాకుండా త్రయోదశి పరమేశ్వరునికి కూడా ఇష్టమైన రోజు. త్రయోదశి శనివారం రోజు వస్తే శివ

త్రయోదని శనివారం నాడు వస్తే ఆ రోజున శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం రోజు శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు. అంతేకాకుండా త్రయోదశి పరమేశ్వరునికి కూడా ఇష్టమైన రోజు. త్రయోదశి శనివారం రోజు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొన్నారు. శనీశ్వరుడు జన్మించిన రోజు కూడా శని త్రయోదశి రోజునే. అందుకే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది.
 
ఈ త్రయోదని రోజున శనీశ్వరునికి పూజలు చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. శనివారం నాడు శ్రీమహాలక్ష్మీ, నారాయణుడు అశ్వత్థవృక్షంపై ఉంటారని పురాణాలలో చెబుతున్నారు. అందువలన శని త్రయోదశి రోజున అశ్వత్థవృక్ష సందర్శన, ప్రదక్షణలు చేయాలి. ఈ రోజున సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేసి నువ్వుల నూనెతో శనీశ్వరునికి అభిషేకాలు చేయాలి.
 
అంతేకాకుండా కాకికి నైవేద్యం పెట్టాలి. నల్లపువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి. శని దోషాలు తొలగిపోవాలంటే ఈ స్తోత్రాన్ని పఠించాలి. ''నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్.., ఛాయా మార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరమ్''. ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఏలినాటి శని దోషాలు తప్పకుండా తొలగిపోతాయి.