శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (18:36 IST)

శివలింగాన్ని ప్రార్థిస్తే... ఎలాంటి ఫలితాలు లభిస్తాయ్?

కార్తీక మాసంలో శివలింగ ప్రార్థన సకల సంపదలను, మనోభీష్టాన్ని నెరవేరుస్తుంది. కార్తీక సోమవారాల్లో శివలింగాన్ని పూజించేవారికి ఈతిబాధలు తొలగిపోతాయి. 
 
నియమనిష్టలను పాటిస్తూ లింగార్చన, లింగాలకు అభిషేకాలు చేయిస్తే శుభఫలితాలు లభిస్తాయి. కార్తీకంలో లింగేశ్వరుడికి చేసే దీపారాధన వలన సమస్త పాపాలు నశించి, సకలశుభాలు కలుగుతాయి. 
 
ముఖ్యంగా సోమవారం శివాలయాల్లో లింగార్చన, రుద్రాభిషేకం, కుంకుమార్చన చేయించడం ద్వారా అనంత పుణ్యఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.