గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 8 మే 2015 (18:48 IST)

బ్రహ్మ ముహూర్తం అనేది ఎలా వచ్చింది..? సూర్యుని సారథిగా..?

బ్రహ్మదేవుడు సృష్టికర్త. అలాంటి బ్రహ్మ పేరుతో వచ్చే ఓ ముహూర్తానికి ఉన్నత స్థానముందనే విషయం తెలిసిందే. బ్రహ్మ మహూర్తం అనేది ఎలా వచ్చిందంటే.. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి.
 
ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో "అండం'' పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మ ముహూర్త కాలమంటారు. 
 
ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడుచేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మ ముహూర్త కాలం అన్ని శుభకార్యాలకు ఉన్నతమైనదని పండితులు అంటున్నారు. ఈ బ్రహ్మ ముహూర్త కాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు చెబుతున్నారు.