శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 14 నవంబరు 2014 (18:06 IST)

కొబ్బరికాయ విశిష్టత ఏమిటో తెలుసా?

కొబ్బరికాయకు విశిష్టత ఏంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవండి. కొబ్బరికాయ లేని దైవకార్యంగానీ, శుభకార్యంగానీ ఎక్కడా కనిపించవు. దేవుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు. కొబ్బరిని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు.
 
కొబ్బరి కాయకు మూడు కన్నులు వుండటం వలన దీనిని 'ముక్కంటి కాయ'అని కూడా అంటారు. కొబ్బరి కాయను కొట్టడం వలన అది రెండు చిప్పలుగా పగిలిపోతుంది. ఈ రెండింటిని దేవుడికి ... జీవుడికి ప్రతీకగా భావించడం జరుగుతుంది.
 
కొబ్బరికాయకి గల మూడు కన్నుల్లోను 'బ్రహ్మనాడి'గా చెప్పుకునే పై భాగంలోని కన్ను నుంచి మాత్రమే నీరు బయటికి వస్తుంది. 'బ్రహ్మనాడి'ద్వారానే జీవుడు పరమాత్ముణ్ణి చేరుకోగలుగుతాడనే విషయాన్ని కొబ్బరికాయ తెలియజేస్తోంది.