Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మంగళవాద్యాలు ఎదురుపడితే.. మంచి శకునమా?

శనివారం, 22 నవంబరు 2014 (16:40 IST)

Widgets Magazine

సాధారమంగా ఏదైనా శుభకార్యానికో ముఖ్యమైన పనికో వెళ్లాలనుకున్నప్పుడు మంచి శకునం చూడటం పరిపాటి. ఉద్యోగ అన్వేషణకు, వివాహ ప్రయత్నాలకు, దైవకార్యాలకు సంబంధించి ఇలా ఏ ముఖ్యమైన పనిమీద బయలుదేరవలసి వచ్చినా, మంచి ముహూర్తంతో పాటు శకునం చూసుకునే వెళుతుంటారు.
 
ఎందుకంటే మంచి శకునం వలన తలపెట్టిన కార్యక్రమం సాఫీగా పూర్తవుతుందనీ, లేదంటే ఆదిలోనే ఆ పనికి ఆటంకాలు ఎదురుపడతాయని విశ్వాసం. శకునం బాగోలేదని ప్రయాణాలు వాయిదా వేసుకునే వాళ్లు, ఇంట్లోకి వచ్చి కాళ్లు కడుక్కుని ఇష్టదేవతను ప్రార్ధించి తిరిగి బయలుదేరేవాళ్లు ఉంటారు.
 
అలా ఒక ముఖ్యమైన పనిమీద బయలుదేరిన వారికి 'మంగళ వాద్యాలు' వినిపించినా ... ఎదురుగా వస్తూ కనిపించినా, ఎలాంటి సందేహం లేకుండా ముందుకి సాగిపోవచ్చని శాస్త్రం చెబుతోంది.
 
మంగళవాద్యాలు అనడంలోనే అవి ఎంతటి శుభప్రదమైనవో చెప్పబడుతున్నాయి. శుభకార్యాలకు, దైవకార్యాలకు, వివిధ రకాల వేడుకలకు మంగళవాద్యాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఏదో ఒక వేడుకకి సంబంధించిన వాళ్లు మంగళ వాద్యాలతో ఎదురుపడితే అది శుభానికి సూచనగా భావించాలి. 
 
తాము శ్రీకారం చుట్టబోతోన్న పనికి భగవంతుడి ఆశిస్సులు లభించినట్టుగా అనుకోవాలి. తాము ఏదైతే పని మీద బయలుదేరుతున్నామో ఆ పని విజయవంతంగా పూర్తవుతుందని విశ్వసించాలని పండితులు చెబుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

వధూవరుల నుదుటన ధరించే బాసికం ప్రాముఖ్యత ఏంటి?

వధూవరులు నుదుటన ధరించే 'బాసికం' ఓ అందమైన అలంకారంగా కనిపిస్తుంది. కానీ శాస్త్ర పరంగా ...

news

కప్పుతో కాఫీ గానీ టీ గాని తాగినట్లు కల వస్తే..?

* కప్పుతో కాఫీ గానీ టీ గానీ త్రాగుచున్నట్లు కల వచ్చినట్లైతే అదృష్టము కలిసి వచ్చును. * ...

news

వాస్తు : పడమర దిశలో నివసించే వారైతే..?

పడమర స్థలములో నివసించే వారు గంభీరమైన హృదయము, నిశ్చిత అభిప్రాయములు గల వారుగా ఉంటారు. ...

news

ఉత్తర దిశయందు నూతులు, గోతులున్నట్లైతే..?

ఉత్తర దిశలో గృహమందుగానీ, ఖాళీ స్థలమందు గానీ ఉత్తర దిశ మెరక కలిగివున్నట్లైతే గౌరవభంగము, ...

Widgets Magazine