Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే?

ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (10:22 IST)

Widgets Magazine
lord Hanuman

పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఆయన్ని స్మరిస్తే.. సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయి. ఐదు ముఖాలతో వుండే హనుమంతుని ఒక్కో ముఖానికి ఒక్కో గుణం ఉంటుంది. ఆంజనేయుడి ముఖం ప్రధానంగా ఉంటుంది. ఈ ముఖాన్ని చూస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. అలాగే మిగిలిన ముఖాలలో నారసింహునికి అభీష్టసిద్ధి, గరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి వుంటుంది. 
 
కుడివైపు చివరన వుండే వరహా ముఖం దానప్రపత్తిని ఎడమవైపు చివరన వుండే హయగ్రీవ ముఖం సర్వవిద్యలను కలుగజేస్తాయి. అందుకనే పంచముఖ ఆంజనేయస్వామి దర్శనం అన్ని విధాల శుభాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. 
 
పంచముఖ హనుమంతునికి వున్న పదిచేతుల్లోని ఆయుధాలు భక్తులను కాపాడుతాయి. నాలుగు దిక్కులతో పాటు పైనుంచి వచ్చే విపత్తులనుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచముఖంగా.. తుంగభద్ర నదీతీరంలో స్వామి వారి కోసం తపస్సు ఆచరించిన శ్రీరాఘవేంద్రస్వామికి ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇక హనమంతునికి శని, మంగళవారాల్లో తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఆంజనేయ స్వామికి "శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

నిద్రలేమిని దూరం చేసుకోవాలంటే..? శ్రీవారిని.. మీనాక్షి దేవిని దర్శించుకోండి..

నిద్రలేమి వేధిస్తుందా? అయితే పరిహారం చేయండి అంటున్నారు జ్యోతిష్యులు. ఇదేంటి? నిద్రకు ...

news

మీ పేరులోనే అదృష్టముంది..ఎలా..!

చాలా మంది పేరులో ఏముందని భావిస్తారు. కానీ పేరులోనే మీ అదృష్టం ఉందని స్టడీస్ చెబుతున్నాయి. ...

news

పూజ సామాన్లు ఎలా శుభ్రం చేయాలో తెలుసా? విభూతి ప్రసాదాన్ని కింద పారేస్తే?

పూజ సామాన్లు ఎలా శుభ్రం చేయాలో తెలుసా? నిమ్మరసం, పీతాంబరి పౌడర్, విభూతి ద్వారా పూజ ...

news

ఏడు రోజులు... ఏయే దేవతలను పూజించాలి... ఆదివారం సూర్యుడిని?

వారానికి ఏడు రోజులు. అయితే ప్రతీ రోజుకీ ఓ ప్రత్యేకత ఉంది. పంచాంగం ప్రకారం ప్రతీ రోజుకీ ఓ ...

Widgets Magazine