Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిద్రలేమిని దూరం చేసుకోవాలంటే..? శ్రీవారిని.. మీనాక్షి దేవిని దర్శించుకోండి..

బుధవారం, 26 ఏప్రియల్ 2017 (15:47 IST)

Widgets Magazine

నిద్రలేమి వేధిస్తుందా? అయితే పరిహారం చేయండి అంటున్నారు జ్యోతిష్యులు. ఇదేంటి? నిద్రకు జ్యోతిష్యానికి సంబంధం ఉందా? అని అనుకుంటున్నారు కదూ. అయితే ఈ స్టోరీ చదవండి. కర్మ ఫలితమే నిద్రభంగానికి కారణమవుతుందని జ్యోతిష్కులు అంటున్నారు. ఆరోగ్యానికి ఆహారం ఎలా ముఖ్యమో.. అలాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర లేకపోతే.. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. శరీర బరువు పెరిగిపోతుంది. హృద్రోగ సంబంధిత వ్యాధులు తప్పవు. ఆపై ఆస్పత్రుల వెంట తిరగాల్సిందే. 
 
నిద్రలేమికి పగటిపూట ఎక్కువ సేపు నిద్రించడం. లేకుంటే గంటల పాటు టీవీలకు అతుక్కుపోవడం వంటివి. ఇంకా మానసిక ఒత్తిడి, ఆందోళన, ఇతరత్రా సమస్యలే నిద్రలేమికి కారణం అవుతాయి. నిద్రలేమితో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. శరీరాన్ని అలసట ఆవహిస్తుంది. అందుకే నిద్రకు ఉపయోగించే పడకగదిని ఆహ్లాదకరంగా మార్చుకోవాలి. పగటి పూట నిద్రించే అలవాటుకు స్వస్తి చెప్పాలి. కంప్యూటర్ల ముందు అతుక్కుపోకుండా.. నడక, వ్యాయామం, పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. 
 
అయితే జ్యోతిష్కులు ఏం చెప్తున్నారంటే..?
మంచి నిద్ర ఓ వరప్రసాదం. అయితే ఓ మనిషికి ఎలాంటి నిద్ర పరిమితమనేది జాతక చక్రాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. గ్రహాల ప్రభావంతోనే నిద్రలేమి కారణమవుతుందట. నిద్ర ఎక్కువైనా, తక్కువైనా మెదడుకే దెబ్బ. నిద్రలేమితో నరాల బలహీనత కూడా ఏర్పడుతుంది. శరీర నరాల వ్యవస్థకు అధిపతి, విద్యాకారకుడు బుధుడు. ఇతనే నిద్రకు కూడా కారకుడు. 
 
జాతక ప్రకారం ఓ వ్యక్తికి మానసిక ఆందోళన, కోమా వంటివి బుధుడి అశుభ కారకాలవుతాయి. ఇక జాతకప్రకారం చంద్రుని అనుగ్రహం లభిస్తే... నిద్రలేమి దూరమవుతుంది. కోపం, ఆగ్రహం ఎక్కువైనా చంద్రుని అనుగ్రహం ముఖ్యం. నిద్రను శుక్రగ్రహం కూడా నిర్ణయిస్తుంది. శుక్రుడు వ్యక్తి ఆహ్లాదాన్ని ఇవ్వగలుగుతారు. జాతకంలో బుధుడు, శుక్రుడు, చంద్రుడు కేంద్ర బలం, త్రికోణ బలం సాధిస్తే.. వారి జీవితం సుఖ సంతోషాలతో చేకూరుతుంది. బుధుడు, శుక్రుడు, చంద్రుడి బలం తగ్గితే మాత్రం నిద్రలేమి వంటి ఇతరత్రా సమస్యలు తప్పవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా కర్మఫలాలు కూడా నిద్రలేమికి కారణం. వారి వారి పుణ్యఫలాన్ని బట్టే నిద్ర వుంటుంది. శని, రాహు, కేతు, గురు గ్రహాలు కర్మ ఫలాలకు కారకులు. బుధుడు, శుక్రుడు, చంద్రులు పాప గ్రహాలతో స్థానాధిపత్యం ఏర్పడితే నిద్రలేమి ఏర్పడుతుంది. దీనికి పరిహారం కావాలంటే తమిళనాడులోని పూంబుకార్ రోడ్డులో తిరువెంగాడులోని బుధుడిని దర్శించుకోవాలి. లేదంటే మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇంకా శ్రీరంగం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నా నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. ఈ ఆలయాలను దర్శించుకుంటే.. నిద్రలేమిని దూరం చేసుకుని.. సుఖమయ జీవితాన్ని పొందవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Link Astrology Navagrahas Stress Pressure Sleep Less

Loading comments ...

భవిష్యవాణి

news

మీ పేరులోనే అదృష్టముంది..ఎలా..!

చాలా మంది పేరులో ఏముందని భావిస్తారు. కానీ పేరులోనే మీ అదృష్టం ఉందని స్టడీస్ చెబుతున్నాయి. ...

news

పూజ సామాన్లు ఎలా శుభ్రం చేయాలో తెలుసా? విభూతి ప్రసాదాన్ని కింద పారేస్తే?

పూజ సామాన్లు ఎలా శుభ్రం చేయాలో తెలుసా? నిమ్మరసం, పీతాంబరి పౌడర్, విభూతి ద్వారా పూజ ...

news

ఏడు రోజులు... ఏయే దేవతలను పూజించాలి... ఆదివారం సూర్యుడిని?

వారానికి ఏడు రోజులు. అయితే ప్రతీ రోజుకీ ఓ ప్రత్యేకత ఉంది. పంచాంగం ప్రకారం ప్రతీ రోజుకీ ఓ ...

news

అద్దె ఇంట్లో హోమాలు చేయొచ్చా..? సొంతింటి కల నెరవేరాలంటే?

స్వగృహం కోసం ఎదురుచూస్తున్నారా? సొంతింటి నిర్మాణం కోసం లక్షలు ఖర్చు పెట్టేందుకు ...

Widgets Magazine