బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : బుధవారం, 9 జులై 2014 (19:23 IST)

ఆలయానికి వెళ్తున్నారా? అయితే ఇలాంటి పనులు చేయకండి!

ఆలయానికి వెళ్తున్నారా? అయితే ఇలాంటి పనులు చేయకండి! అంటున్నారు పురోహితులు. దైవానికి తోచిన రీతిలో పూజలు చేస్తాం. నిజానికి ఆలయంలో ఎలా మసలు కోవాలి. ఆ పరమాత్మను ఎలా పూజించాలి. ఎలా ప్రదక్షిణలు చేయాలి. ఇలాంటి ఆలోచనలు మనల్ని చుట్టు ముడతాయి. ఈ సందేహాలకు వరాహపురాణంలో పరిష్కారం సూచించారు. ఆ పురాణం ఆధారంగా దేవాలయంలో ఎలాంటి పనులు చేయకూడదో చూద్దాం. 
 
* ఒక చేతితో దైవాన్ని నమస్కరించ కూడదు.  
* గుడిలోకి వెళ్లేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు
* గుడిలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నాక నమస్కరించకుండా ఉండకూడదు. 
* దైవ దర్శనం అయ్యాక గుడిలో కూర్చుంటాం. అలా కూర్చునేటప్పుడు భగవంతునికి ఎదురుగా కాళ్ళు చాపడం, వీపును భగవంతుని వైపు పెట్టడం చేయకూడదు. 
 
* ఆలయ మంటపంలో భోజనం చేయకూడదు. 
* ఆలయంలో నిద్ర చేయాల్సి వస్తే భగవంతుని ఎదురుగా పడుకోకూడదు. 
* ఆలయంలో గట్టిగా మాట్లాడడం, అరవడం, ఏడ్వడం, దెబ్బలాడడం చేయకూడదు. 
* ముఖ్యంగా ఉపకారం చేస్తానని ప్రతిజ్ఞ చేయడం కూడదు. 
* నిన్నేం చేస్తానో చూడు అని బెదిరించకూడదు. 
* స్త్రీలతో పరిహాసంగా మాట్లాడకూడదు. 
 

* కంబళి, శాలువతో కప్పుకుని దైవ దర్శనానికి వెళ్ళకూడదు
* ఇతరులను నిందించకూడదు. 
* ఎవరినైనా పొగడడం చేయకూడదు. 
* మాంసాహారం తినకూడదు. 
* తోటలోనైనా, ఇంట్లోనైనా పండిన పండ్లను, పూచిన పూలను, కూరలను భగవంతునికి  సమర్పించకుండా ముందుగా తినకూడదు. 


* ఆలయంలో దైవం ముందు ఇతరులకు నమస్కరించకూడదు. 
* ఆలయంలో తనను తాను పొగడుకోవడం కూడదు. 
* గట్టిగా గంట మోగించకూడదు. 
* భగవంతుడిని నిందించకూడదు. 

ఆలయంలో ఇలాంటి పనులు చేస్తే భగవంతుని సేవించిన పుణ్యం దక్కకపోవడమే కాదు.. మిక్కిలి పాపం చేసినట్లు అవుతుందని వరాహపురాణం చెబుతోంది.