శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 25 మే 2015 (19:06 IST)

దిక్పాలకులుగా నాగులు: తూర్పుకు అనంతుడు, ఈశాన్యంలో..?

మనిషి నుండి తొలిగా పూజలందుకున్న జీవి సర్పం. సిరియా, ఈజిప్టు వంటి దేశాల్లో ఒకనాడు నాగపూజ ఉండేది. నేటికీ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో నాగపూజ సాగుతోంది. మనదేశంలో నాగవంశాలు, నాగతెగలవారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం నాగాలాండ్‌లున్నాయి. నాగులకు ప్రత్యేక శక్తులున్నాయని అన్ని దేశాల వారి నమ్మకం. రత్నాలు, వజ్రాలు వంటి విలువైన రాళ్ళు, సంప్రదలను ఆశ్రయించి పాములుంటాయన్నది నమ్మకం. 
 
నాగులకు సంతానం అందించే శక్తి వుందన్న విశ్వాసం అందరకీ వుంది. జ్ఞానానికి నాగులను చిహ్నంగా భావిస్తారు. హైందవ పురాణాలుల్లో పలురకాల నాగుపాములున్నాయి. శేషుడు విష్ణుమూర్తి పవళించే పాన్పు. శివుడు ధరించే పామునే. అలాగే శ్రీకృష్ణుడు కాళింది సర్పం గర్వం వదిలించాడు. బౌద్ధ, జైన సంస్కృతులలోనూ నాద సర్పాలున్నాయి. వాటికి పూజలు అనేకంగా వున్నాయి. 
 
మానవులను సర్పాలను అద్భుతంగా ఊహించి ప్రదర్శించని కుండలిని విద్యలో. మెలికలు తిరిగిన సర్పరూపంలోని శక్తి దాగివుంటుంది. శరీరంలో దాగివున్న ఆ శక్తిని విడుదలచేయడమే కుండలిని విద్య. పురాణాలలో నాగులను దిక్పాలకులుగా వర్ణించారు. 
 
తూర్పుకు అనంతుడు, ఈశాన్యంలో అభోగ, దక్షిణాన వాసుకి, నైరుతి మూలన శంఖసాల, వాయువ్యంలో కులిక, ఈశాన్యంలో మహాపద్ముడు దిక్పాలకులయ్యారు. సంతానం కోసం నాగులను పూజించడం ఆచారం. సంతానం పొందినవారు నాగప్రతిష్ట చేస్తుంటారు. సంతానం లేకపోతే నాగదోషమని విశ్వసిస్తుంటారు.