శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (13:42 IST)

తుమ్మితే శుభమా? అశుభమా? తుమ్ము ఎందుకొస్తుంది.. ఆ సమయంలో గుండె ఆగిపోతుందా?

ఏదైనా మంచి కార్యం తలపెట్టినప్పుడు తుమ్మితే ఇంకేముందిలే అయిపోయినట్లే అనుకుని అశుభంగా భావిస్తారు. మంచి కార్యాన్ని వాయిదా వేస్తారు. అలాగే మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరైనా తుమ్మితే ఆ మాట సత్యం అంటారు. నిజా

ఏదైనా మంచి కార్యం తలపెట్టినప్పుడు తుమ్మితే ఇంకేముందిలే అయిపోయినట్లే అనుకుని అశుభంగా భావిస్తారు. మంచి కార్యాన్ని వాయిదా వేస్తారు. అలాగే మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరైనా తుమ్మితే ఆ మాట సత్యం అంటారు. నిజాని తుమ్ము శుభమా? అశుభమా? అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సైన్స్ ప్రకారం కడుపు నిండుగా ఉన్నప్పుడు.. సూక్ష్మక్రిముల సంక్రమణం జరిగినప్పుడు తుమ్ము రావటం జరుగుతుంది. 
 
తుమ్మటం ద్వారా దాదాపు 40వేల సూక్ష్మజీవులు సెకనుకు వంద మైళ్ల వేగంతో గాలిలోకి విసరబడతాయట. అందువల్ల ఆ సమయంలో చుట్టూ ఉన్నవారు కాస్త ఇబ్బందికి లోనౌతారు. మరి దీనిని అశుభ కారణంగా ఎందుకు భావిస్తారు అంటే? ఆధ్యాత్మికపరంగా సృష్టికర్త బృహస్పతి శకున ప్రకరణలో.. గర్గుని సూత్రాల్లో తుమ్ము అశుభం అని చెప్పబడింది. కానీ ఒక ఆరోగ్య వంతుడు ఉన్నట్టుండి తుమ్మితేనే అది అశుభంగా పరిగణించాల్సి వుంటుంది. 
 
ఆరోగ్యవంతుడు మాత్రమే అకాలంలో తుమ్ముతాడు. అంటే అక్కడి వాతావరణంలో ఏదైనా అనారోగ్యకరమైన మార్పు జరిగిందని అర్థం చేసుకోవాలి. అందుకని ఏదైనా శుభకార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు ఎవరైనా తుమ్మితే అశుభంగా తీసుకోవాలి. ఆ క్షణం గుండె కొట్టుకోవటం ఆగటం వల్ల దాదాపుగా మరణం సంభవించినట్లుగా భావించి.. చిరంజీవ. చిరంజీవ. శ్రీరామరక్ష దీర్ఘాయురస్తు.. అని అంటుంటారు. అందుకే తుమ్మును అశుభంగా భావిస్తారు. అయితే మంచి మాట్లాడుతున్నప్పుడు అకాలంలో ఎవరైనా తుమ్మితే శుభంగానూ.. ఏదైనా శుభకార్యం తలపెట్టేందుకు వెళ్ళేటప్పుడు తుమ్మితే దాన్ని అశుభంగా భావించాలని పండితులు సూచిస్తున్నారు.