Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రయాణం చేయడానికి శుభ ముహూర్తాలు... ఏ రోజు ప్రయాణం చేయకూడదు?

సోమవారం, 3 జులై 2017 (19:41 IST)

Widgets Magazine

సుదూర తీర ప్రాంతాలకు వెళ్లేటపుడు మంచి చెడులు చూసి బయలుదేరమని మన పెద్దలు, జ్యోతిష శాస్త్రం, వివిధ రకాల గ్రంథాలు మనకు చెబుతున్నాయి. సోమ, బుధ, గురు,శుక్ర వారాలు ప్రయాణానికి శుభప్రదాలు. అదేవిధంగా విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి శుభ తిథులుగా పరిగణించబడుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలుదేరటం శ్రేయస్కరం. 
 
అదేవిధంగా శుక్ర, ఆది వారాలు పశ్చిమ దిశ ప్రయాణం మంచిది కాదు. మంగళ, బుధవారాలు ఉత్తర దిక్కుకు శూల కలిగిస్తాయి. గురువారం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయకూడదు. భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ,విశాఖ, పూర్వాషాఢ, పూర్వభాద్ర, నక్షత్రాలు, స్థిర లగ్నాలు నిషేధించబడ్డాయి. ఇక శుభ లగ్నాల విషయానికి వస్తే... మేషం, మిధునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం శుభ లగ్నాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా సోమవారం తూర్పు దిశగా ప్రయాణాలు చేయకూడదు.
 
ప్రయాణ ముహూర్తాలకు ఆది, మంగళ,శనివారములు పాడ్యమి, రిక్త తిధులు, పంచ పర్వాలు, ద్వాదశి, షష్ఠి, అష్టమీలలో ప్రయాణాలు నిషిధ్దాలని కాళిదాసు చెబుతోంది. గురువారం దక్షిణ దిక్కునకు శూలప్రదమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ,రేవతి శుభ నక్షత్రాలుగా పరిగణిస్తున్నారు. అదే విధంగా తీర్థయాత్రలు దీర్ఘకాలిక ప్రయాణములను మౌఢ్యమునందు చేయకపోవటం మంచిది. కుజ, బుధ, శుక్రులున్న దిశకు ప్రయాణాలు చేయకూడదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Travel Good Muhurtas

Loading comments ...

భవిష్యవాణి

news

రాశి ఫలితాలు (03-07-17) : రాజకీయాల్లో రాణిస్తారు...

ఉద్యోగంలో శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల ఒత్తిడి, ప్రలోభాలకు ...

news

జూలై నెల రాశి ఫలితాలు... అవకాశాలు చేజార్చుకోవద్దు(వీడియో)

మేషరాశి : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: ఈ మాసం అనుకూలదాయకమే. ప్రతిభాపాటవాలు వెలుగులోకి ...

news

సూర్యోదయం సమయాన ఆదిత్యుడిని ఇలా పూజిస్తే?

ఆదివారం పూట మాంసాహారం తీసుకోకుండా ఉండటం మంచిది. లేదంటే ఆదివారం సూర్యోదయ సమయంలో పూజ ...

news

తులసీ మొక్క వాడిపోతే.. కీడు జరుగుతుందని గుర్తించాలట?

ఇంటి ముందు వుండే తులసీ కోటలోని తులసీ మొక్క వాడిపోతే కీడు జరుగుతుందని గుర్తించాలట. తుల‌సి ...

Widgets Magazine