శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (10:44 IST)

మంగళ, శుక్రవారాల్లో రుణం ఇస్తే.. సూర్యాస్తమయం తర్వాత డబ్బు ఇస్తే?

మంగళవారం అప్పు చేయడం కలహాలకు దారితీస్తుందని.. అలాగే శుక్రవారం పూట ఎవ్వరికైనా రుణం ఇస్తే తిరిగి రావడం కష్టమని.. ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. మంగళ, శుక్రవారాల్లో ఎవ్వరికీ రుణం ఇవ్వకూడదు. తీసుకోకూడదు.

మంగళవారం అప్పు చేయడం కలహాలకు దారితీస్తుందని.. అలాగే శుక్రవారం పూట ఎవ్వరికైనా రుణం ఇస్తే తిరిగి రావడం కష్టమని.. ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. మంగళ, శుక్రవారాల్లో ఎవ్వరికీ రుణం ఇవ్వకూడదు. తీసుకోకూడదు. కానీ మంగళ, శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి, సొంతానికి, కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టవచ్చు. శుక్రవారం పూట లక్ష్మీ దేవిని పూజిస్తాం కాబట్టి.. ఆ తల్లి డబ్బు రూపంలో మన నుంచి ఇతరులకు వెళ్ళిపోతుందనే ఆచారంతో ఆ రోజు చాలామంది డబ్బు ఇతరులకు ఇవ్వరు. 
 
అలాగే కుజుడు మంగళవారానికి అధిపతి. ఇంకా కుజుడు సమస్యలు సృష్టించడంలో దిట్ట. అందుకే మంగళవారం పూట ధన లావాదేవీలు చేయడం సబబు కాదని పెద్దలు అంటారు. కాబట్టి మంగళ, శుక్రవారాల్లో ధన ఇవ్వకూడదనే నియమం ధర్మ శాస్త్రాల్లో లేదని.. ఈ నియమం పెద్దలు అనుసరించిన ఆచారాల్లో ఒకటని పండితులు చెప్తున్నారు. 
 
అయితే వారాల్లో సంబంధం లేకుండా ఏ రోజైనా.. ఏ వారమైనా.. సూర్యాస్తమయం అయ్యాక ధనం, బంగారం ఇవ్వకూడదు. సూర్యాస్తమయం అయ్యాక... మరుసటి రోజు సూర్యోదయం అయ్యేవరకు ఎవ్వరికీ ధనం కానీ... స్వర్ణం, వెండి కానీ ఇవ్వనేకూడదని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత డబ్బు కనుక ఇతరులకు ఇస్తే... సిరిసంపదలు మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయని వారు హెచ్చరిస్తున్నారు.