శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : గురువారం, 16 ఆగస్టు 2018 (21:50 IST)

తొలి పూజ ఎవరికి చేయాలో తెలుసా?

తొలి పూజ గణపతికి చేయాలని పురాణాలలో చెబుతుంటారు. దేవతలు, మహర్షులు సైతం మెుదటగా వినాయకుడినే పూజిస్తుంటారు. ఎక్కడ ఏ శుభకార్య జరిగినా అది వినాయకుని ఆరాధనతోనే మెుదలవుతుంది. అంతేకాకుండా తలపెట్టిన కార్యక్రమా

తొలి పూజ గణపతికి చేయాలని పురాణాలలో చెబుతుంటారు. దేవతలు, మహర్షులు సైతం మెుదటగా వినాయకుడినే పూజిస్తుంటారు. ఎక్కడ ఏ శుభకార్య జరిగినా అది వినాయకుని ఆరాధనతోనే మెుదలవుతుంది. అంతేకాకుండా తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి కాగలవు. జీవితంలో అడుగు ముందుకు వేయడానికి, అభివృద్ధిని సాధించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు.
 
అలాంటి సమయంలో ప్రారంభించే పనులు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా సాగిపోతుండాలి. అలా జరగాలంటే గణపతి అనుగ్రహం కావలసి ఉంటుంది. గణపతిని పూజించడం వలన అడ్డంకాలన్నీ తొలగిపొయి తలపెట్టిన కార్యక్రమాలలో సఫలీకృతులవుతారు. 
 
క్షీరసాగర మథనం సమయంలో మందర పర్వతం నీటిలో మునగడం అందరికీ నిరాశను కలిగిస్తుంది. అందుకు కారణం గణపతికి పూజలు చేయకపోవడం వలనే అలా జరుగుతుందని శ్రీ మహా విష్ణువు చెప్పారట. అప్పటి నుండి ప్రజలందరు మెుదటి సారిగా గణపతిని పూజిస్తుంటారు. దాని ఫలితంగా కష్టతరమైన కార్యాలన్నీ ఏ ఆటంకాలు లేకుండా జరుగుతాయి.