శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (15:03 IST)

కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు...?

దైవానికి కొబ్బరికాయను కొట్టడం చూస్తుంటాం. కొబ్బరికాయ కొట్టడం శాంతికారకం, అరిష్ట నాశకం. శాస్త్రం ప్రకారం కొబ్బరికాయను కొట్టటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కొబ్బరికాయను భగంవతునికి సమర్పించే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తరువాత భగవంతుని స్మరిస్తూ  కొట్టాలి. 
 
రాయిపై కొబ్బరికాయను కొట్టేవారు ఆ రాయిని ఆగ్నేయ దిశగా ఉండేటట్లు చేయటం మంచిది. కొబ్బరికాయ సరిసమానంగా పగలటం మంచిదే. అయితే ఒకవేళ వంకరటింకరగా పగిలినప్పటికీ, కుళ్లిపోయినట్లు కనిపించినప్పటికీ దిగులచెందాల్సిన అవసరం లేదు. 
 
అదేవిధంగా కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు కొబ్బరికాయను కొట్టి దానిని విడదీయకుండా చేతితో పట్టుకుని అభిషేకం చేయకూడదు. కాయను కొట్టి ఆ జలాన్ని ఓ పాత్రలోకి తీసుకుని, కాయను వేరుచేసి ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటితో మాత్రమే అభిషేకించాలి.