Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీవారికి మట్టితో లేదా వెండితో చేసిన ఇంటి ప్రతిమను ఇస్తానని మొక్కుకుంటే?

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (14:58 IST)

Widgets Magazine
Lord Venkateswara

కలియుగ ప్రత్యక్ష దైవం, పిలిస్తే పలికే దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. శనివారం వ్రతమాచరించి శ్రీవారిని పూజించే వారికి సొంతింటి కలే కాదు.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. భక్తులతో సాటివాడిలా మాట్లాడే వెంకన్నను శనివారం పూజిస్తే, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే.. వెండితో చేసిన ఇల్లును ఇస్తానని, లేదా మట్టితో చేసిన ఇంటి ప్రతిమను ఇస్తానని స్వామివారికి మొక్కుకోవాలి. 
 
మట్టితో లేదా వెండితో చేసిన ఇంటిని.. పూజగదిలో ఉత్తరం వైపున ఉంచి ఆ ఇంటినే శనివారం పూజించాలి. ఇంటి బొమ్మపై పువ్వులు అక్షింతలు వేసి.. ఆ ఇంటి ముందు నేతితో దీపమెలిగించి పూజించడం ద్వారా శ్రీవారి అనుగ్రహంతో ఇంటికల సాకారం అవుతుంది. ఇంటినే పూజిస్తూ.. సొంత గృహాన్ని ప్రసాదించు తండ్రీ అంటూ గోవిందుడికి పూజ చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది. 
 
ఇంటి ప్రతిమ ముందు ఐదు పిడికెలు బియ్యం పిండి, పాలు, బెల్లం మూడింటిని ఉండలా చేసుకుని.. బియ్యం పిండి ముద్దను ప్రమిద వలె చేసుకుని.. అందులో రెండు దూది వత్తులను ఉంచాలి. కరిగించిన నెయ్యినే అందులో పోయాలి. ఈ దీపం భూమి, నీరు, ఆకాశం, తేజస్సుకు ప్రతీక. దేహానికి ప్రాణశక్తిగా దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని పూజగదిలో ఉంచిన ఇంటి ప్రతిమ ముందు వుంచి దీపారాధన చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులతో కూడిన ఇతరత్రా ప్రతికూలతలు తొలగిపోయి.. సొంతింటి కల నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు.
 
ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత "ఓం వేంకటేశాయ" అనే నామాన్ని 108 సార్లు పఠించడం ద్వారా ప్రగతి కాలానికి దైవం, వృద్ధికారకుడు అయిన శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో వచ్చే శనివారం ప్రారంభించాలి. లేకుంటే ఏ మాసంలో వచ్చే శనివారమైనా ప్రారంభించాలి. సొంతింటి కల నెరవేరాలని శ్రీవారి శరణాలను ఆశ్రయించి వేడుకోవడం ద్వారా ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా ఆస్తి, ఉద్యోగం, లౌకిక కోరికలు నెరవేరుతాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

అరటి, కొబ్బరికాయలను మాత్రమే దేవుళ్లకు సమర్పిస్తారు... ఎందుకని?

భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలున్నప్పటికీ అరటికాయ, కొబ్బరికాయలకే ప్రాధాన్యం. ...

news

ఓ వృద్ధురాలి కోసం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఏం చేశారో తెలుసా...?!

సాధారణంగా ఎవరైనా ఒకసారి మంచి పేరు వస్తే ఆ తరువాత వెనక్కి తిరిగి చూడరు. హెడ్ వెయిట్ ...

news

అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే దరిద్రం పట్టుకుంటుందా?

అక్షయ తృతీయ వస్తుందంటే నగల దుకాణాలు కిక్కిరిసిపోతుంటాయి. అక్షయ తృతీయ పండుగనాడు తప్పకుండా ...

news

తితిదే కాంట్రాక్ట్ పనుల్లో భారీ కుంభకోణం - ఒకే సంస్థకు పగ్గాలు..!

తిరుమల, తిరుపతిలోని తితిదే అద్దె గదులను శుభ్రం చేసే హౌస్ కీపింగ్‌కు సంబంధించి ఇటీవల ...

Widgets Magazine