మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (17:14 IST)

భీష్మ ఏకాదశి: విష్ణు సహస్రనామ పారాయణతో మోక్షప్రాప్తి!

భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. తిలద్వాదశి నాడు నువ్వులతో చేసిన పదార్ధాలను తినడం, నువ్వుల నూనెతో అభ్యంగన స్నానమాచరించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించి దానమివ్వడం చేస్తే కష్టాలు తొలగుతాయి.
 
ఇకపోతే... శ్రీ విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు మాఘ శుద్ధ ఏకాదశి నాడు శ్రీకృష్ణుడికి అంకితమిచ్చాడు. భీష్ముడి శ్రీ విష్ణు సహస్ర నామాలతోనే ప్రస్తుతం కృష్ణుడిని యావత్తు ప్రపంచం ప్రార్థిస్తున్న సంగతి తెలిసిందే. 
 
విష్ణు సహస్ర నామాన్ని రోజూ పఠించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయం కావడంతో పాటు మోక్షం ప్రాప్తిస్తుంది. అలాగే విష్ణు సహస్ర నామాలను చదవకపోయినా.. కనీసం విన్నా కూడా ఈతిబాధలు సులభంగా తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.